బిజెపి రాజకీయ ఎత్తుగడ: అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు

By Arun Kumar PFirst Published Jan 7, 2019, 9:29 PM IST
Highlights

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అగ్రకులాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలా ఆదాయ పరిమితితో కూడిన రిజర్వేషన్లు ప్రకటించిన మోదీ సర్కార్ భారీ ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అగ్రకులాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలా ఆదాయ పరిమితితో కూడిన రిజర్వేషన్లు ప్రకటించిన మోదీ సర్కార్ భారీ ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రాజగకీయ ఎత్తుగడ గురించి మై నేషన్ ముందుగానే చెప్పింది. అదే నిజమైంది.

ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 10  ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనుంది.రిజర్వేషన్లను 50 నుండి 60 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. రిజర్వేషన్ల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్లు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ వర్గాలు మరియు బిసిల రిజర్వేషన్లకు ఏమాత్రం ఆటంకం  కలిగించడం లేదు. ఇలా ఇతర రిజర్వేషన్లకు ఏమాత్రం ఆటంకం కలిగించకుండా కేంద్ర ప్రత్యేక కోటాను ఆగ్రకులాలకు ప్రకటించడం వెనుక ఓ రహస్య ఎజెండా దాగివుందని సమాచారం. 

ప్రస్తుతం అగ్రవర్ణాల్లో మోదీ ప్రభుత్వంపై  వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటి కేసును మరింత కఠినతరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వారి కోపానికి కారణమవుతోంది. ఈ చట్టం కింద నిందితులకు వెంటనే అరెస్ట్ చేయాలంటూ వున్న చట్టానికి సుప్రీం కోర్టు కొన్ని పరిమితులు విధించింది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం ఓ అర్డినెన్స్ తీసుకువచ్చి ఈ పరిమితులు లేకుండా చేసింది. 

ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ కొన్ని సంస్థలు భారత్ బంద్ కు కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ  అశంపై కొందరు నెటిజన్లయితే సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న బిజెపి కి వ్యతిరేకంగా 2019 లో నోటాకు ఓటేసి జాతీయ పార్టీలకు బుద్దిచెప్పాలంటూ పిలుపునిచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రయోగమే 2016 లో గుజరాత్ లోని బిజెపి ప్రభుత్వం చేపట్టి మంచి ఫలితాలను సాధించింది.  ఇక్కడ 6 లక్షల కంటే తక్కువ వార్షికాధాయయం కలిగిన అగ్రవర్ణ పేదలకు కూడా ప్రభుత్వం 10శాతం రిజర్వేషన్ ప్రకటించింది. అయితే ఆ రాష్ట్ర హైకోర్టు దీన్ని వ్యతిరేకింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా  ఇలాంటి నిర్ణయమే తీసుకున్నప్పటికి  అక్కడా హైకోర్టే అడ్డుతగిలింది.

ఏదేమైనప్పటికి తాజాగా ప్రకటనతో ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లను అందించాలని కేంద్రం భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందుకు ఎలాంటి ఆటంకం రాకుండా వుండేందుకు పార్లమెంట్ సాక్షిగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.  

click me!