మహిళలు అండగా యోగి సర్కార్ ... నవరాత్రుల వేళ మిషన్ శక్తి 5.O

By Arun Kumar PFirst Published Oct 1, 2024, 10:11 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మరీముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో చాలా సీరియస్ గా వున్నారు.  

లక్నో : ఉత్తరప్రదేశ్‌ మహిళల భద్రత, గౌరవం, స్వావలంబన లక్ష్యంగా యోగి ప్రభుత్వం మిషన్ శక్తి 5వ దశను ప్రారంభించనుంది. ఈ దశలో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి, వ్యాపారాల్లో ప్రోత్సాహం అందించేందుకు ఉమెన్స్ ఫెస్ట్ నిర్వహించనుంది. అంతేకాదు అన్ని కార్యాలయాల్లో మహిళలకు రిటైరింగ్ రూమ్‌లు, క్రెచ్ లు ఏర్పాట చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో ఫెస్ట్‌లో స్టాల్స్

శారదీయ నవరాత్రి తొలి రోజైన అక్టోబర్ 3న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన నివాసం నుంచి మిషన్ శక్తి 5వ దశను ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏడీజీ పద్మజా చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన మిషన్ శక్తి నోడల్ అధికారులు (పోలీసు డీఎస్పీలు/ఎఎస్పీలు) ఆన్‌లైన్‌లో పాల్గొంటారు. లక్నోతో పాటు అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో మహిళా సాధికారత ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీఎం యోగి మహిళా భద్రత, సాధికారత, స్వావలంబన కోసం వివిధ ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తారని ఆమె చెప్పారు.

Latest Videos

1090 చౌరాహా వద్ద మహిళలకు స్వయం ఉపాధి, వ్యాపారాల్లో ప్రోత్సాహం అందించేందుకు ఉమెన్స్ ఫెస్ట్ నిర్వహించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫెస్ట్‌లో మహిళల స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తాము తయారు చేసిన ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చాగోష్ఠులు, వైద్య శిబిరాలు, ప్రేరణాత్మక ప్రసంగాలు, నాటికలు, క్విజ్‌లు, పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.

మహిళలకు రిటైరింగ్ రూమ్‌లు, క్రెచ్‌లు, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ నిర్మాణం

మిషన్ శక్తి 5వ దశలో భాగంగా అన్ని కార్యాలయాల్లో మహిళలకు రిటైరింగ్ రూమ్‌లు, క్రెచ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు. పోలీస్ లైన్లు, పీఏసీ బెటాలియన్లు, మెడికల్ కాలేజీల్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ నిర్మిస్తారు. ఈ హాస్టళ్లలో మహిళల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా బ్యారక్‌లు ఏర్పాటు చేస్తారు. లక్నో తరహాలోనే అన్ని కమిషనరేట్లలో పింక్ బూత్‌లు, పింక్ స్కూటీలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.

మాల్స్, పబ్లిక్ పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జంతు ప్రదర్శనశాలల్లో తల్లులు పిల్లలకు పాలు పట్టడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తారు. నిర్మాణ రంగం, కార్మాగారాలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేసి అక్కడ పింక్ టాయిలెట్లు నిర్మిస్తారు.

12 శాఖల భాగస్వామ్యంతో మిషన్ శక్తి 5.O

మిషన్ శక్తి 5వ దశ కార్యక్రమాన్ని 12 శాఖలు సంయుక్తంగా అమలు చేస్తాయి. వీటిలో హోం, మహిళా, శిశు సంక్షేమం, మున్సిపల్, పంచాయతీ రాజ్, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖలు భాగస్వామ్యం వహిస్తాయి.

click me!