తమ్ముడి హత్యకు ప్రతీకారం: ప్రత్యర్ధిని హత్య చేసి ఫోటో తీసుకొన్నాడు

By narsimha lodeFirst Published Oct 28, 2020, 6:09 PM IST
Highlights

తుపాకీతో ఓ వ్యక్తిని కాల్చిచంపిన దుండగుడు.... చనిపోయిన వ్యక్తి ఫోటోను తన సెల్ ఫోన్ లో తీసుకొని వెళ్లిపోయాడు.ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది.

న్యూఢిల్లీ: తుపాకీతో ఓ వ్యక్తిని కాల్చిచంపిన దుండగుడు.... చనిపోయిన వ్యక్తి ఫోటోను తన సెల్ ఫోన్ లో తీసుకొని వెళ్లిపోయాడు.ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది.

ఈ ఘటన ఈ నెల 22వ తేదీన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని నవాడ హౌసింగ్ కాంప్లెక్స్  సమీపంలోని 55 పీట్ రోడ్డులో జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.17 సెకండ్ల నిడివి ఉన్న సీసీటీవీ పుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితుడు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చాడు. దీంతో అతను అక్కడికక్కడే పడి చనిపోయాడు.

తన జేబులోని మొబైల్ ను తీసుకొని నిందితుడు చనిపోయిన వ్యక్తి ఫోటోను తీసుకొన్నాడు. ఈ దృశ్యాల ఆధారంగా పవన్ గెహ్లాట్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సోదరుడి హత్యకు ప్రతీకారంగానే వికాస్ మెహాతాను హత్య చేసినట్టుగా గెహ్లాట్ ఒప్పుకొన్నాడు.

2019 మేలో ప్రవీణ్ గెహ్లాట్ మరణించాడు. వికాస్ దలాల్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయాడు. అయితే పోలీసులు జరిపిన కాల్పుల్లో దలాల్ కూడ మరణించాడు.పవన్, దలాల్ మృతి చెందడంతో అతని అనుచరులను మట్టుబెట్టాలని ఆయన ప్లాన్ చేశాడు. దలాల్ దగ్గర పనిచేసే ప్రదీప్ సోలంకి, అతడితో సంబంధం ఉన్న వికాస్ మోహతా కదలికలపై దృష్టి పెట్టాడు.మోహన్ గార్డెన్ ఏరియాలో వికాస్ మెహతాపై అతి సమీపంలో కాల్పులు జరిపాడు.

click me!