ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి... భార్య స్నానంచేస్తున్న ఫోటోలు షేర్ చేసి....!

Published : Sep 03, 2022, 11:22 AM IST
  ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి... భార్య స్నానంచేస్తున్న ఫోటోలు షేర్ చేసి....!

సారాంశం

అతను ఫేస్ బుక్ లో ఫాలోవర్స్ ని పెంచుకనేందుకు తన భార్యకు తెలియకుండా ఆమె బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా వీడియో తీశాడు

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఆ సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసుకునేవారు కొందరైతే.... ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు వీడియోలు చేయడం, డ్యాన్స్ లు ఇలా రకరకాలు చేసి.. తమ టాలెంట్ బయటపెట్టి ఫాలోవర్స్ పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. ఓ వ్యక్తి ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య స్నానం చేస్తుండగా ఆ ఫోటోలను సీక్రెట్ గా తీసి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సంఘటన ఫిరోజీబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిరోజీబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో సర్కస్ లో పనిచేస్తున్నాడు. కాగా.. అతను ఫేస్ బుక్ లో ఫాలోవర్స్ ని పెంచుకనేందుకు తన భార్యకు తెలియకుండా ఆమె బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. అతను ఢిల్లీలో... భార్య ఫిరోజీబాద్ లో ఉండటంతో... వారు తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే అతను భార్య స్నానం చేస్తున్నప్పుడు కూడా వీడియో చేసి.. దాన్నంతటినీ రికార్డు చేశాడు.

అనంతరం ఆ వీడియోని  ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు  చేసింది. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలియగానే అతను ఫేస్ బుక్ ఖాతాను డిలీట్ చేయడం గమనార్హం.

తన భర్త ఇలా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నాడని తెలిసి తాను షాకయ్యానని... డిలీట్ చేయమని అడిగితే అతను అంగీకరించలేదని ఆమె వాపోయింది. తన భర్తకు కఠినంగా శిక్ష విధించాలని ఆమె పోలీసును కోరడం గమనార్హం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?