గర్భవతి అయిన మాజీ ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు.. ఎందుకంటే...

By Bukka SumabalaFirst Published Aug 15, 2022, 11:31 AM IST
Highlights

ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. ఈ సమయంలో ఆమె గర్భవతి కావడంతో థానేలో కలకలం రేగింది. 

మహారాష్ట్ర : maharashtraలోని థానేలో షాకింగ్ ఘటన జరిగింది. థానేలోని ముంబ్రాకు చెందిన 23 ఏళ్ల యువకుడు తన former girlfriend గొంతు కోసి హత్య చేశాడు. ఈ సమయంలో ఆమె pregnant. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలు ముస్కాన్ అలియాస్ నదియా ముల్లాగా, నిందితుడిని ఓ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అల్తమాష్ దల్వీగా గుర్తించారు.

అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కృపాలి బోర్సే తెలిపిన వివరాల ప్రకారం... శనివారం మధ్యాహ్నం 3-5.30 గంటల మధ్య విరాని ఎస్టేట్ లో ఈ ఘటన జరిగింది. నిందితుడు పదునైన ఆయుధంతో ముల్లా గొంతు కోశాడు. హత్యకు ముందు వీరిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ సమయంలో ఆమె అతడిని బ్లాక్ మెయిల్ చేసింది. నా కడుపులో నీ బిడ్డను మోస్తున్నాను.. కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలంటూ అడిగింది. దీంతో కోపానికి వచ్చిన అల్మామాష్ దీనికి ఒప్పుకోలేదు. అయినా ఆమె వినలేదు. 

KARNATAKA: కోర్టులో దారుణం.. క‌ట్టుకున్న‌ భార్య గొంతు కోసి దారుణ హత్య

దీంతో కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆ తరువాత నిందితుడు ముంబ్రా నుండి పారిపోబోతున్నాడని తమకు సమాచారం అందిందని బోర్స్ చెప్పారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు థానే రైల్వే స్టేషన్ సమీపంలో అతనిని పట్టుకుని ముంబ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామని తెలపారు. విచారణలో, తనకు, మృతురాలికి మధ్య రెండేళ్లుగా సంబంధం ఉందని, వారి తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో కొన్ని నెలల క్రితం తామిద్దరం విడిపోయామని దాల్వీ పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితమే ఆమెకు అబార్షన్ అయ్యిందని, ఆ తర్వాత తామిద్దరి మధ్య మాటలు లేవని చెప్పాడని.. ముంబ్రా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు.

"వారు విడిపోయిన తర్వాత, దాల్వీ తల్లిదండ్రులు అతనికోసం సంబంధాలు చూస్తున్నారు. నవీ ముంబైలో ఉన్న ఒక అమ్మాయితో అతని వివాహాన్ని నిశ్చయించారు. కానీ ముల్లా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి గొడవ చేసింది. దీంతో నిందితుడికి విపరీతమైన కోపం వచ్చింది’ అని అధికారి చెప్పారు. ఆ తర్వాత కూడా ఆమె వదలలేదు. తాను మళ్లీ గర్బవతినయ్యానని.. దానికి అతడే కారణం అని.. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించింది. 

అతను ఆమెకు దాదాపు రూ.1.5 లక్షలు చెల్లించాడు. ఆమె ఇంకా కావాలని అడుగుతుండడంతో ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో ఆమెను అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. దీంతో మాట్లాడదాం రమ్మని ఒక దగ్గరికి పిలిచాడు. అక్కడా వాగ్వాదం జరిగి ఆమె గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. యువతి పోస్టుమార్టం రిపోర్టుల కోసం చూస్తున్నామని.. కేసు మీద విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
 

click me!