ఢిల్లీలో ఆటోలో ప్రయాణించిన వ్యక్తికి రూ. 7 కోట్లు చెల్లించాలని బిల్లు రావడంతో షాకయ్యాడు. టెక్నికల్ సమస్యతో ఈ ఘటన చోటు చేసుకుందని గుర్తించారు.
న్యూఢిల్లీ:ఓ ఆటోలో ప్రయాణించిన జర్నలిస్టుకు రూ. 7.66 కోట్లు చార్జీ చెల్లించాలని బిల్లు రావడంతో అతను షాకయ్యాడు. టెక్నికల్ సమస్యలతో రూ. 7.66 కోట్ల బిల్లు వచ్చినట్టుగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఘటన మార్చి 29న చోటు చేసుకుంది.
దీపక్ అతని స్నేహితుడు ఆటోలో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ట్రిప్ చార్జీ రూ. 1.67 కోట్లు, వెయిటింగ్ చార్జీ రూ. 5.99 కోట్లు గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రమోషనల్ డిస్కౌంట్ గా రూ. 75 ప్రకటించినట్టుగా ఆ బిల్లులో ఉంది. ఆటోను బుక్ చేసి తక్షణమే కోటీశ్వరులు అవ్వండని క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను పోస్టు చేశారు.
सुबह-सुबह ने को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t
— Ashish Mishra (@ktakshish)ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. చంద్రయాన్ బడ్జెట్ కూడ ఇంతకంటే తక్కువ బిల్లు ఉంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టెక్నికల్ సమస్యతోనే ఈ ఘటన చోటు చేసుకుందని ఉబేర్ సంస్థ ప్రకటించింది. దీనిపై విచారణ జరిపి త్వరలో అప్ డేట్ చేస్తామని ప్రకటించింది.
👉 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి. Have your say! 📢https://telugu.asianetnews.com/mood-of-andhra-survey