కన్న తల్లి, పిన్ని నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు

Published : Nov 06, 2019, 01:55 PM IST
కన్న తల్లి, పిన్ని నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో  పెట్టిన యువకుడు

సారాంశం

అతని సెల్‌ఫోన్‌లో తనిఖీ చేయగా 50 ఏళ్లలోపు 100 మందికి పైబడిన మహిళా ఫొటోలను అసభ్యంగా చిత్రీకరించినట్లు గుర్తించారు. అతను తన తల్లి, పిన్ని, బంధువులు ఫోటోలు సైతం అసభ్యంగా చిత్రీకరించాడు

కన్న తల్లి, సొంత పిన్నిలను ఓ యువకుడు నడి బజారుకి ఈడ్చాడు. వారి నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వందలాది యువతుల ఫోటోలను అదే విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి...జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.... పెరియ కాంచీపురం మల్లిగై వీధికి చెందిన మహ్మద్‌ గయాస్‌ (27) శ్రీ పెరంబదూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. అతను చెన్నై ట్రిప్లికేన్‌లో అద్దె ఇంటిలో వివాహం చేసుకోకుండా సుమతి అనే యువతితో కలసి వుంటున్నాడు.

ఈ క్రమంలో సుమతితో కలిసి పలు కార్యక్రమాలకు హాజరైన గయాస్‌ మహిళలకు తెలియకుండా ఫోటోలు తీసి వాటిని అసభ్యంగా చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఓ యువతి ఫేస్‌బుక్‌ చూస్తున్న సమయంలో తన ఫొటో అసభ్యంగా చిత్రీకరించడం చూసి దిగ్భ్రాంతి చెందింది. 

దీనిపై చెన్నై వెస్టుజోన్‌ జాయింట్‌ కమిషనర్‌ విజయకుమార్‌కు ఫిర్యాదు చేసింది. దీనినై విచారణ చేసిన పోలీసులు మహ్మద్‌ గయాస్‌ను అరెస్టు చేశారు. అతని సెల్‌ఫోన్‌లో తనిఖీ చేయగా 50 ఏళ్లలోపు 100 మందికి పైబడిన మహిళా ఫొటోలను అసభ్యంగా చిత్రీకరించినట్లు గుర్తించారు. అతను తన తల్లి, పిన్ని, బంధువులు ఫోటోలు సైతం అసభ్యంగా చిత్రీకరించాడు. గయాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works