బ్యాంకింగ్‌, కార్డులు, ఆధార్‌, ఎఫ్‌డీ, ఈపీఎఫ్‌, ఎల్పీజీ...జూన్‌లో ఆర్థిక మార్పుల జాతర

Published : May 30, 2025, 06:06 AM IST
aadhar voter id link

సారాంశం

జూన్‌లో క్రెడిట్ కార్డు రివార్డులు, బ్యాంక్ వడ్డీ రేట్లు, ఆధార్ అప్‌డేట్ గడువు, EPFO మార్పులు వంటి అనేక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి.

జూన్ నెలతో పాటు  కొత్త ఆర్థిక మార్పులు  వస్తున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్ల నుంచి క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లు, ఆధార్ అప్‌డేట్ గడువు వరకు అనేక రంగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ విషయాలు ప్రతి ఆర్థిక వినియోగదారుడు తెలుసుకోవాల్సినవే.మొదటగా డిపాజిట్‌ల విషయానికి వస్తే.. ఆర్‌బీఐ వడ్డీ రేటు తగ్గింపు ప్రభావంతో కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తక్కువగా నిర్ణయించాయి. ముఖ్యంగా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జూన్ 1 నుంచి తమ FD వడ్డీ రేట్లను తగ్గించనుంది. ఇతర బ్యాంకులు కూడా ఇదే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ EPFO ఈ నెలలో 3.0 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కాబోతోంది. ఈ అప్‌డేట్‌తో యూపీఐ ద్వారా నిధుల ఉపసంహరణ, ఏటీఎం సదుపాయాల వంటివి లభించనున్నాయి. అలాగే క్లెయిమ్ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది.సెబీ తీసుకొచ్చిన కొత్త నియమాల ప్రకారం ఓవర్‌నైట్ ఫండ్లలో పెట్టుబడులకు సంబంధించిన కటాఫ్ టైమ్ జూన్ 1 నుంచి మారుతుంది. ఆఫ్‌లైన్ అప్లికేషన్లకు మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన దరఖాస్తులకు అదే రోజు ఎన్‌ఏవీ వర్తిస్తే, ఆ తర్వాత వేరు. ఆన్‌లైన్ దరఖాస్తులు సాయంత్రం 7 వరకు స్వీకరించనున్నారు.

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఈ నెలలో కొన్ని షాక్‌లు తప్పవు. కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకులు తమ కార్డులపై కొన్ని లావాదేవీలకు రివార్డ్ పాయింట్లను తగ్గిస్తున్నాయి. కొన్ని ట్రాన్సాక్షన్‌లపై పూర్తిగా రివార్డులను నిలిపేయగా, మరికొన్నింటికి పరిమితి విధించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డులకు సంబంధించిన లాంజ్ యాక్సెస్‌లో కూడా మార్పులు చేసింది. రూ.50 వేలు మించి ఖర్చు చేసినవారికే లాంజ్ యాక్సెస్ అవకాశం ఉంటుంది. ఈ మార్పు జూన్ 10 నుంచి అమల్లోకి వస్తుంది.

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ జూన్ 4 నుండి 6 వరకు సమావేశమవుతుంది. గతంలో రెపోరేటు తగ్గించిన నేపథ్యంలో మరోసారి వడ్డీ తగ్గితే గృహ, వాహన రుణాలు తీసుకునే వారికి ఊరట దక్కుతుంది.ఆధార్ వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువు జూన్ 14తో ముగియనుంది. ఒకవేళ ఈ గడువులోగా 'మైఆధార్' పోర్టల్‌లో అప్‌డేట్ చేయకపోతే తర్వాత రూ.50 చెల్లించి ఆధార్ సెంటర్లలో చేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. మే నెలలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గిన తరహాలో జూన్ 1న కూడా కొత్త ధరల ప్రకటన ఉండొచ్చు.ఇలా జూన్ నెలలో  ఆర్థిక రంగంలో అనేక అంశాలు ముందుకు రాబోతున్నాయి. ఈ మార్పులు ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపేలా ఉంటాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu