మహా కుంభమేళా గురించి రాకేష్ కుమార్ శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు...

Published : Dec 30, 2024, 11:45 PM ISTUpdated : Dec 30, 2024, 11:46 PM IST
 మహా కుంభమేళా గురించి  రాకేష్ కుమార్ శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు...

సారాంశం

మహాకుంభ్ 2025 కేవలం ఒక మేళా కాదు దాదాపు డెబ్బై రోజుల పాటు జరిగే సాంస్కృతిక కార్యక్రమం. దీన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు యోగి సర్కార్ సిద్దమయ్యింది. 

ప్రయాగరాజ్ :  మహా కుంభమేళాకు దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు దీనియొక్క గొప్పతనం తెలియాల్సిన అవసరం వుంది. అప్పుడే వారు ఈ మహా కుంభమేళా యొక్క మహాత్మ్యం, మూలాన్ని అర్థం చేసుకుని పుణ్య లాభాన్ని పొందగలరు. ఈ క్రమంలోనే ప్రయాగపుత్రుడిగా ప్రసిద్ధి చెందిన రాకేష్ కుమార్ శుక్లా ఈ గొప్ప కార్యక్రమం గురించి వివరంగా చర్చించారు. మహా కుంభమేళా డిజిటల్ డిటాక్స్ తో పాటు పతితులను పావనులుగా చేసే పర్వమని ఆయన అన్నారు. తన కాఫీ టేబుల్ పుస్తకంలో కూడా దీని గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.

2019 కుంభమేళాలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించిన రాకేష్ కుమార్ శుక్లా మాట్లాడుతూ... కుంభమేళా ఒక పర్వం, దీన్ని మేళాగా చేయవద్దని అన్నారు. కుంభ్‌ను నాలుగు భాగాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మిక భావన, రెండవది నిర్వహణ, మూడవది ఆర్థిక వ్యవస్థ, నాల్గవది ప్రపంచ భాగస్వామ్యం. ప్రతి భక్తుడు కుంభ్ అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు? ఈ మహాకుంభ్ ఎలా ఉంటుంది? అని అర్థం చేసుకోవడం అవసరం.
 
ఈ భూమిపై ఉన్న ఏకైక ధర్మం సనాతన వైదిక హిందూ ధర్మం, దీని ఉద్దేశ్యం నర సేవ, నారాయణ సేవ భావనతో మానవ కల్యాణం చేయడం. ఈ ఆలోచన ఋషిమునుల సత్సంగ్ నుండి ప్రారంభమవుతుంది. మహాకుంభ్‌ను ఋషులు, మునులు, యతులు, యోగులు, సన్యాసులు, మహాత్ములు, సమాజం కలిసి నిర్మిస్తారు. వ్యాపారంలో ధర్మం ఉండాలి కానీ ధర్మం వ్యాపారం కాకూడదనేది సన్యాసుల సందేశం. ఒక నిమిషం రీల్ కి బదులుగా నిజ జీవితాన్ని గడపడమే ఇక్కడ కల్పవాసం యొక్క ఉద్దేశ్యం. మహాకుంభ్ ఈశ్వరీయ శక్తితో నడిచే ముఖ్యమైన పర్వమని రాకేష్ కుమార్ శుక్లా అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం