మైనర్ బాలికపై నెలరోజులుగా అత్యాచారం..వీడియో తీసి..

Published : Oct 15, 2020, 11:17 AM IST
మైనర్ బాలికపై నెలరోజులుగా అత్యాచారం..వీడియో తీసి..

సారాంశం

అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత మరొకరు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానంతటినీ వీడియో తీసి.. దానిని చూపించి బాలికను బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టారు.

మైనర్ బాలికపై  ముగ్గురు యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. గత నెల రోజులుగా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బ్లాక్ మెయిల్ చేయడం గమనార్హం. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో చోటుచేసుకోగా.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భూపాల్ లోని గౌతమ్ నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక(14) కి లాక్ డౌన్ సమయంలో ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. వారితో కలిసి బాలిక పబ్జీ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. ఆ ముగ్గురితో బాలికకు స్నేహం బలపడింది. కాగా.. వాళ్లు పథకం ప్రకారం.. బాలికను బయటకు వెళదామని చెప్పి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లారు.

అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత మరొకరు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానంతటినీ వీడియో తీసి.. దానిని చూపించి బాలికను బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టారు. ఆ వీడియో చూపించి.. బాలికను తాము ఉన్న ప్రాంతానికి రప్పించుకొని.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

వారి బెదిరింపులు రోజు రోజుకీ ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన బాలిక.. ఈ విషయాన్ని తన తల్లితో పంచుకుంది. వెంటనే.. తల్లి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు ప్రకారం పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  బాధితురాలి వయసు 14 సంవత్సరాలు అని.. ఆరో తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు విడిపోయారని.. ఆమె తల్లి ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోందని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families