UP Assembly Election 2022: బీజేపీపై ఛ‌త్తీస్‌గ‌డ్ సీఎం భూపేష్ బ‌ఘేల్ ఫైర్ !

Published : Jan 20, 2022, 05:39 AM IST
UP Assembly Election 2022: బీజేపీపై ఛ‌త్తీస్‌గ‌డ్ సీఎం భూపేష్ బ‌ఘేల్ ఫైర్ !

సారాంశం

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఛ‌త్తీస్ గ‌ఢ్  సీఎం భూపేష్ బ‌ఘేల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌తిప‌క్ష పాలిత రాష్ట్రాల్లో దాడులు జ‌ర‌ప‌డంపై బీజేపీ తీరును అంపైర్లు సహా 13 మందితో ఆడుతున్న పాకిస్థాన్ జ‌ట్టు అంటూ విమ‌ర్శించారు.  

UP Assembly Election 2022: వ‌చ్చే నెల‌లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో యూపీ రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి. 

ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఛ‌త్తీస్ గ‌ఢ్  సీఎం భూపేష్ బ‌ఘేల్ (Bhupesh Baghel) బీజేపీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌తిప‌క్ష పాలిత రాష్ట్రాల్లో దాడులు జ‌ర‌ప‌డంపై బీజేపీ తీరును అపైంర్లు సహా 13 మందితో ఆడుతున్న పాకిస్థాన్ జ‌ట్టు అంటూ విమ‌ర్శించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్య‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం ముమ్మ‌రం చేసింది.  కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఛ‌త్తీస్ గ‌ఢ్  సీఎం భూపేష్ బ‌ఘేల్.. రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న బీజేపీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా బీజేపీ (BJP ) యేత‌ర పాలిత రాష్ట్రాల్లో దాడులు జ‌రుగుతాయ‌ని భూపేష్ బ‌ఘేల్ విమ‌ర్శించారు. 

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో దాడులు జరుగుతాయ‌ని  అన్న భూపేశ్ బ‌ఘేల్ (Bhupesh Baghel)..  ఉత్తరాఖండ్, గోవా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రుల బంధువుల ఇంట్లో ఎందుకు దాడులు చేయడం లేదు? అని ప్ర‌శ్నించారు. 11 మంది కాదు అంపైర్లతో సహా 13 మంది ఆటగాళ్లు ఆడుతారని పాకిస్థాన్ గురించి చెప్పిన ఆయ‌న‌, అదే మాదిరిగా కేంద్ర ఏజెన్సీలతో క‌లిసి ఎన్నికల్లో బీజేపీ పోరాడుతుంద‌ని ఎద్దేవా చేశారు. బీజేపీ (BJP ) ఓటమి భ‌యంతో ఇలా దాడులు చేయిస్తోంద‌ని ఆరోపించారు. ద్రవ్యోల్బణం నుండి విముక్తి పొందాలనుకుంటే, రైతులు లాభ‌ప‌డాల‌నుకుంటే ఈ ప్రభుత్వాన్ని గ‌ద్దె దించాల‌ని పిలుపునిచ్చారు. తాను ఇంటింటికి ప్రచారానికి వెళ్లాన‌నీ, ప్ర‌జ‌లు యోగి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో  ఉన్నార‌ని తెలిసింద‌ని భూపేష్ బ‌ఘేల్ అన్నారు. 

 

కాగా, కాంగ్రెస్‌ (Congress) అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఎన్నికల నేప‌థ్యంలో పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్రమ ఇసుక మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మనీలాండరింగ్ నిరోధక దర్యాప్తును నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చరణ్‌జిత్  సింగ్ చన్నీ మేనల్లుడి ప్రాంగణాలపై దాడి చేసింది. ముఖ్య‌మంత్రి సంబందికుల‌పైనా దాడులు నిర్వహించారు. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ నేత‌లు బీజేపీ స‌ర‌కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 

కాగా, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమవుతాయి.  మొత్తం 403 స్థానాలకు ఏడు దశల్లో  ఎన్నిక‌లు నిర్వహించబడతాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో ఓటింగ్ నిర్వహించగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పంజాబ్‌లో ఒకే దశలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !