ఉగ్ర‌వాదంపై పోరులో క‌లిసి న‌డుద్దాం.. భారత్-యూఏఈ వర్చువల్ సమ్మిట్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

Published : Feb 19, 2022, 12:50 AM IST
ఉగ్ర‌వాదంపై పోరులో క‌లిసి న‌డుద్దాం.. భారత్-యూఏఈ వర్చువల్ సమ్మిట్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

సారాంశం

భారత్-యూఏఈ దేశాలు శుక్రవారం వర్చువల్ సమ్మిట్ ను నిర్వహించాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై రెండు దేశాలు సంతకాలు చేశాయి.

యూఏఈలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (prime minister narendra modi) అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్(india), యూఏఈలు (UAE) భుజం భుజం కలిపి నిలబడతాయని చెప్పారు. శుక్ర‌వారం నిర్వ‌హించిన భారత్-యూఏఈ వర్చువల్ సమ్మిట్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ( Crown Prince of Abu Dhabi Sheikh Mohamed bin Zayed al Nahyan) పాల్గొన్నారు. ఇందులో రెండు దేశాల‌కు మ‌ధ్య ఉన్న ద్వైపాక్షిక ప్రయోజనాలతో పాటు ఆర్థిక సహకారం విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రిపారు. 

2022 సంవత్సరం రెండు దేశాలకు ముఖ్యమైనది 
కోవిడ్ -19 (COVID-19) సంక్షోభ సమయంలో భారతీయ పౌరులను జాగ్రత్తగా చూసుకున్నందుకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. సీమాంతర ఉగ్రవాదంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ తీవ్రవాదంపై బలమైన పోరాటంలో భారతదేశం యొక్క నిబద్ధతను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వేడుకలు ప్రారంభించిందని తెలిపారు. అలాగే యూఏఈ స్థాపించి 50 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా సంబ‌రాలు జ‌రుపుకుంటున్నార‌ని అన్నారు. కాబ‌ట్టి ఈ 2022 సంవ‌త్స‌రం రెండు దేశాలకు చాలా ముఖ్య‌మైద‌ని అన్నారు. 

గ‌త నెల‌లో జ‌మ్మూ కాశ్మీర్ (Jammu kashmir) లెఫ్టినెంట్ గవర్నర్ (Lieutenant Governor) పర్యటన తర్వాత అనేక UAE కంపెనీలు జమ్మూ కాశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనబరిచాయని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో లాజిస్టిక్స్ (logistics), హెల్త్‌కేర్ (healthcare), హాస్పిటాలిటీ (hospitality)తో సహా అన్ని రంగాలలో UAE పెట్టుబడులను తాము స్వాగతిస్తున్నాము అని తెలిపారు. సమ్మిట్ సందర్భంగా భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య లోతైన స్నేహం, భాగస్వామ్య దృక్పథం. నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ తెలిపారు. ‘‘ ఇది మన ఆర్థిక సంబంధాలలో కొత్త శకానికి నాంది పలుకుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రాబోయే ఐదేళ్లలో మన వ్యాపారం 60 బిలియన్ డాలర్ల (billion dollar) నుంచి 100 బిలియన్ డాలర్ల (billion dollar) కు పెరుగుతుంది ’’ అని ప్రధాని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?