రెండు రోజులుగా బండ రాళ్ల మధ్యే : కేరళ యువకుడిని రక్షించిన ఆర్మీ

Published : Feb 09, 2022, 10:44 AM ISTUpdated : Feb 09, 2022, 11:05 AM IST
రెండు రోజులుగా బండ రాళ్ల మధ్యే : కేరళ యువకుడిని రక్షించిన ఆర్మీ

సారాంశం

కేరళ రాష్ట్రంలోని మలప్పుజలోని కొండ చీలికలో చిక్కుకొన్న యువకుడిని ఆర్మీ అధికారులు బుధవారం నాడు రక్షించారు. రెండు రోజులుగా అతడిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని Malampuzha లోని కొండల మధ్య  చిక్కుకొన్న యువకుడిని బుధవారం నాడు ఆర్మీ సురక్షితంగా రక్షించింది. ఈ యువకుడిని రక్షించడం కోసం  Armyని పంపాలని Kerala  సీఎం Pinarayi Vijayan కేంద్రాన్ని కోరారు.

కేరళ రాష్ట్రంలోని మలప్పుజలోని కొండ చీలికలో చిక్కుకొన్న యువకుడిని ఆర్మీ అధికారులు బుధవారం నాడు రక్షించారు. రెండు రోజులుగా అతడిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ అధికారులు 40  గంటల తర్వాత కొండపై బండరాళ్ల మధ్య చిక్కుకొన్న బాబు అనే ట్రెక్కర్ వద్దకు చేరుకొన్నారు. అతనికి  ఆహారం, నీరు అందించారు.  తాడు సహాయంతో ట్రెక్కర్ బాబును  మలప్పుజలోని కురుంబావి కొండపైకి తీసుకెళ్తున్నారు. అక్కడి నుండి హెలికాప్టర్ సహాయంతో సమీపంలోని గ్రామానికి తరలించనున్నారు.

భారత ఆర్మీకి చెందిన సదరన్ కమాండ్ కు చెందిన ట్రెక్కర్ నిపుణులతో కూడిన బృందాలు బాబును రక్షించేందుకు మలప్పుజకు మంగళవారం నాడు అర్ధరాత్రి చేరుకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున తమ ఆపరేషన్ ప్రారంభమైందని ఆర్మీ కమాండ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. బండరాళ్ల మధ్య చిక్కుకొన్న బాబును చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

సోమవారం నాడు తన ఇద్దరు మిత్రులతో కలిసి బాబు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో కాలుజారి లోతైన లోయలో పడిపోయాడు. కొండకు దిగువన 200 అడుగుల ఎత్తులో ఉన్నట్టుగా బాబును గుర్తించిన ఆర్మీని ఇవాళ ఉదయం రక్షించారు. బాబు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు.

కేరళ రాష్ట్రం పాలక్కడ్‌లోని నిటారుగా దుర్భేద్యంగా ఉన్న కురుంబాచి కొండను ఎక్కడానికి సోమవారం మధ్యాహ్నం బాబు, మరో ఇద్దరు మిత్రులు సిద్ధం అయ్యారు. ఆ ముగ్గురు ట్రెక్కింగ్ ప్రారంభించారు. సగం దూరం వెళ్లాక బాబుతో వచ్చిన ఇద్దరు మిత్రులు ఆ కొండ ఎక్కలేకపోయారు. కానీ, బాబు మాత్రం తన ట్రెక్కింగ్ ఆపలేదు. చివరకు ఆయన కొండ టాప్‌కు వెళ్లాడు. కానీ, కొండ టాప్ నుంచి ఆయన జారిపోయాడు. లోయలాగా ఉన్న లోతైన భాగంలోకి పడి రాళ్ల మధ్యలో చిక్కుకున్నాడు. బండ రాళ్ల మధ్య పడడంతో తన  కాలికి గాయమైన చిత్రాలను బాబు పంపించారు. ఆర్మీ సిబ్బంది ఇవాళ ఆయనను రక్షించారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu