కర్ణాటక రాష్ట్రంలో ఉప ఎన్నికల పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే.. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. మంగళవారం సాయంత్రానికే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. విజయంపట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలు ధీమాగా ఉన్నాయి. 15 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ 15 నియోజకవర్గాలను ఎలగైనా దక్కించుకోవాలని సీఎం యడ్యూరప్ప భావిస్తుండగా... తమ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఆ 15 నియోజకవర్గాలపై ప్రతిపక్ష పార్టీ కూడా అంతే కసిగా ఉంది. కర్ణాటక ముఖచిత్రాన్ని మార్చివేసే ఈ ఉప ఎన్నికల్లో 195మంది అభ్యర్థులు పోటీచేస్తుండగా, వారిలో 128మంది స్వతంత్రులు ఉన్నారు. 9మంది మహిళలు పోటీకి దిగారు.కాంగ్రెస్ నుంచి 15మంది, బిజెపి నుంచి 15మంది, జెడిఎస్ నుంచి 13 బరిలో వుండగా, ఇద్దరు ఇండిపెండెంట్లకు జెడిఎస్ మద్దతిస్తోంది.