బ్యాంక్ కి టోకరా... సీఎం మేనల్లుడు అరెస్ట్

By telugu teamFirst Published Aug 20, 2019, 10:24 AM IST
Highlights

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదు చేసిన కేసుకు సంబంధించి మోజర్ బేర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతుల్ పురి, ఇతరులపై సీబీఐ సోమవారంనాడు కేసు నమోదు చేసింది. నిందితులైన మాజీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ గత ఆదివారం దాడులు జరిపింది.

బ్యాంకు కి టోకరా ఇచ్చిన కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పురిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు  చేసింది. రూ.354కోట్ల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రతుల్ పురి మోసం చేశారు. మనీ లాండరింగ్ చట్టం కింద సోమవారం రాత్రి ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు. కాగా.. మంగళవారం ఆయనను  కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
 
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదు చేసిన కేసుకు సంబంధించి మోజర్ బేర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతుల్ పురి, ఇతరులపై సీబీఐ సోమవారంనాడు కేసు నమోదు చేసింది. నిందితులైన మాజీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ గత ఆదివారం దాడులు జరిపింది. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి ఆరోపణల కింద రతుల్, ఆయన కంపెనీ, ఆయన తండ్రి, మేనిజింగ్ డైరెక్టర్ దీపక్ పురి, ఇతర డైరెక్టర్లు నీతాపురి (రతుల్ తల్లి, కమల్‌నాథ్ సోదరి), సంజయ్ జైన్, వినీత్ శర్మలపై కేసులు నమోదు చేసింది.
 
కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రతుల్ 2012లో రాజీనామా చేయగా, ఆయన తల్లిదండ్రులు బోర్టులు కొనసాగుతున్నట్టు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. కాంపాక్ట్ డిస్క్‌లు, డీవీడీలు, సోలిడ్ స్టేట్ స్టోరేజ్ డివైజ్‌లు వంటి ఆప్టికల్ స్టోరేజ్ ఉత్పత్తులను రతుల్ పురి కంపెనీ తయారు చేస్తూ వచ్చింది. 2009 నుంచి వివిధ బ్యాంకుల నుంచి పలుమార్లు ఆ కంపెనీ రుణాలు తీసుకుని, వాటిని చెల్లించకపోవడంతో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపి అది 'ఫ్రాడ్' అకౌంట్‌గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్లతో కంపెనీ, ఆ కంపెనీ డైరెక్టర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు ఆరోపించింది.
 

click me!