Jammu and Kashmir లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు రాజీనామా.. ఎన్నిక‌ల బ‌రిలో బీజేపీ అభ్య‌ర్తిగా !

Published : Mar 21, 2022, 04:53 AM IST
Jammu and Kashmir లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు రాజీనామా.. ఎన్నిక‌ల బ‌రిలో బీజేపీ అభ్య‌ర్తిగా !

సారాంశం

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సలహాదారు ఫరూక్ ఖాన్  రాజీనామా చేశారు. 1990వ దశకంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కీలకపాత్ర పోషించిన ఫరూక్ ఖాన్.. ప‌ద‌వి విర‌మ‌ణ అనంత‌రం త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్నారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అనంత‌రం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కు సలహాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.   

Jammu and Kashmir: జ‌మ్మూ కాశ్మీర్ లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు రోజురోజుకు మారుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సలహాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఫరూక్ ఖాన్ ఆదివారం సాయంత్రం తన రాజీనామాను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. 1990వ దశకంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ IPS అధికారి ఫ‌రూక్ ఖాన్. కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌ర‌గ‌నున్న‌ మొదటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపిలో చేర‌నున్నారు.  జ‌మ్మూకాశ్మీర్  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత‌నికి  కీల‌క‌ బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన ఆయన.. పార్టీ మైనారిటీ విభాగంలో పలు పదవులు నిర్వహించారు.

ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించనప్పటికీ, ప్రస్తుతం కొనసాగుతున్న డీలిమిటేషన్ కసరత్తు మే నాటికి పూర్తి కానున్నాయి.. అక్టోబర్ తర్వాత ఎన్నికలు నిర్వహించవచ్చని అధికారులు భావిస్తున్నారు.


ఆర్టికల్ 370 ర‌ద్దు అనంత‌రం నుంచి ఫరూక్ ఖాన్ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కి సలహాదారుగా నియమితులయ్యారు. అంతకు ముందు ఫరూక్ ఖాన్ లక్షద్వీప్‌కు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు.  1984లో జమ్మూ కాశ్మీర్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా తన వృత్తిని ప్రారంభించి, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా మారారు. 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి పదోన్నతి పొందాడు. 1994లో పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF)కి సారథ్యం వహించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ఫరూక్ ఖాన్ కు మంచి గుర్తింపు వ‌చ్చింది. సీటీఎఫ్ అనేది ఉగ్ర‌వాదుల‌ను ఏరిపారేసే.. ప్రత్యేక బృందం. 

ఆయ‌న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా స‌మ‌యం(2003)లో ప్రసిద్ధ రఘునాథ్ ఆల‌యాన్ని తీవ్రవాదులు  ముట్టడిని చేయ‌గా.. సమ‌ర్థ‌వంతంగా వారిని వేరిపారేశారు.  2013లో ఐజిపిగా, ఉధంపూర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ పోలీస్ అకాడమీ అధిపతిగా పదవీ విరమణ చేశారు. ఆయ‌న పోలీసు కేరీర్ లో ఎన్నో ప‌తకాల‌ను, ప్ర‌శంస‌లను అందుకున్నారు. అనంత‌రం.. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బిజెపిలో చేరారు. ఇప్పుడు ఆయ‌నను బీజేపీ అభ్య‌ర్థిగా..  పూంచ్  లేదా రాజౌరి ప్రాంతాలను బ‌రిలో దించ‌నున్నారు. తద్వారా.. ముస్లిం ఓటర్లను ప్రలోభపెట్ట వ‌చ్చ‌ని బీజేపీ భావిస్తుండ‌ట‌. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?