Today Top Stories: వైసీపీ నాల్గవ జాబితా విడుదల.. అయోధ్యలో ముగిసిన కీలక ఘట్టం,  దావోస్‌లో సీఎం రేవంత్ స్పీచ్ ..

By Rajesh Karampoori  |  First Published Jan 19, 2024, 6:43 AM IST

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  వైసీపీ నాల్గవ జాబితా విడుదల..  షర్మిల కుమారుడి ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన వైఎస్ జగన్ దంపతులు, విహార యాత్రలో విషాదం..  16 మంది మృతి, అయోధ్యలో ముగిసిన కీలక ఘట్టం.. గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట, అయోధ్యలో రామ మందిరంపై  పోస్టల్ స్టాంపు విడుదల, దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్,   అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర, టీ20 ప్రపంచకప్ ఆడే 10 మంది ఆటగాళ్లు ఫైనల్, భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ కు వేదిక‌వుతున్న 'న్యూయార్క్ నాసావు కౌంటీ స్టేడియం వంటి పలు వార్తల సమాహారం


Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  వైసీపీ నాల్గవ జాబితా విడుదల..  షర్మిల కుమారుడి ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన వైఎస్ జగన్ దంపతులు, విహార యాత్రలో విషాదం..  16 మంది మృతి, అయోధ్యలో ముగిసిన కీలక ఘట్టం.. గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట, అయోధ్యలో రామ మందిరంపై  పోస్టల్ స్టాంపు విడుదల, దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్,   అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర, టీ20 ప్రపంచకప్ ఆడే 10 మంది ఆటగాళ్లు ఫైనల్, భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ కు వేదిక‌వుతున్న 'న్యూయార్క్ నాసావు కౌంటీ స్టేడియం వంటి పలు వార్తల సమాహారం

Today Top Stories:  

Latest Videos

undefined

వైసీపీ నాల్గవ జాబితా విడుదల..  

YCP Fourth List: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నాల్గవ లిస్ట్‌ను విడుదల చేయడానికి వైసీపీ భారీ కసరత్తు చేసింది. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం. నాలుగవ జాబితాలో 9 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు  వైసీపీ నాలుగవ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ కారణంతో మూడు రోజులపాటు అభ్యర్థుల మార్పులు-చేర్పుల కసరత్తుకి బ్రేక్‌ పడింది. దీంతో నాలుగో జాబితా కాస్త లేట్ అయ్యింది. 


షర్మిల కుమారుడి ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన వైఎస్ జగన్ దంపతులు 


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు , తన సోదరి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధ వేడుకకు సీఎం వైఎస్ జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు రాజారెడ్డి, ప్రియ అట్లూరిలను జగన్ దంపతులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తన చెల్లెలు షర్మిల, బావ బ్రదర్ అనిల్‌లను ఆయన పలకరించారు. హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం అట్లూరి ప్రియతో జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న రాజారెడ్డి, ప్రియల వివాహం  నిర్వహిస్తున్నట్లుగా షర్మిల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  

విహార యాత్రలో విషాదం..ఇద్దరు ఉపాధ్యాయులతో సహా 16 మంది చిన్నారుల మృతి

 
Boat Capsizes In Vadodara : గుజరాత్ లోని వడోదరలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. హరానీ సరస్సులో పడవ బోల్తా పడటంతో 14 మంది చిన్నారులు. ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 24 మంది పిల్లలు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ టీం సరస్సు నుంచి ఐదుగురు చిన్నారులను రక్షించినట్టు తెలుస్తోంది. 

Ayodhya Ram Mandir : అయోధ్యలో ముగిసిన కీలక ఘట్టం.. గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట
 
అయోధ్య రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి గురువారం కీలక ఘట్టం పూర్తయ్యింది. అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఐదేళ్ల బాల రాముడి 51 అంగుళాల పొడవైన నల్లరాతి విగ్రహాన్ని నాలుగు గంటల పూజలు, వేద మంత్రాల నడుమ ప్రతిష్టించారు. రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ధర్మకర్త బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా పర్యవేక్షణలో ఈ విగ్రహాన్ని ఎంపిక చేశారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో 121 మంది పూజారులు పాల్గొన్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని గర్భగుడిలో వాస్తు పూజ కూడా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 

అయోధ్యలో రామ మందిరంపై  పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన మోడీ

న్యూఢిల్లీ:  అయోధ్యలోని రామ మందిరంపై  తపాలా స్టాంపులు, ప్రపంచ వ్యాప్తంగా  ఉన్న రాముడికి అంకితం చేసిన స్టాంపులతో కూడిన పుస్తకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు విడుదల చేశారు. 48 పేజీల పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, యూఎన్ వంటి సంస్థలతో  సహా  20 దేశాలకు పైగా దేశాలు జారీ చేసిన స్టాంపులు ఈ పుస్తకంలో పొందుపర్చారు.

 అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర..  

Ayodhya Ram Mandir: అయోధ్యలోని బాలరాముడికి తెలంగాణ నుంచి మరో అరుదైన బహుమతి అందనున్నది. శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఇతివ్రుత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరెలో పొందుపర్చడం విశేషం. ఈ చీర తయారీ కోసం 8 గ్రాాముల బంగారం, 20 గ్రాముల వెండిని ఉపయోగించనున్నట్టు  తెలిపారు.

దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో హాజరుకావడానికి స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులు తేవాలనే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే పలు వేల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైందని వార్తలు వచ్చాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఆయన దావోస్‌లో ఓ ప్రసంగం చేశారు. ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అంశంపై జరిగిన సీఈటీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు..  

పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ మరింత బలోపేతం కావడంపై ఫొకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా యూనిట్లలో కీలక మార్పులు చేసింది. పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ఆఫీస్ నుంచి గురవారం సాయంత్రం ఉత్వర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల్లో మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించినట్టు వెల్లడించింది. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా దినేశ్ ను, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాధవ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా భాస్కర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిందరికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు.  

రుణాల వడ్డీ మాఫీ చేసిన సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి  కలను నెరవేర్చేందుకు 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని తీసుకువచ్చింది. ఇళ్ళు లేని నిరుపేదలకు సెంటు స్థలం ఇవ్వడమే కాదు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా చేస్తోంది జగన్ సర్కార్. అలాగే లబ్దిదారులు బ్యాంకుల నుండి రుణం పొందితే ఆ వడ్డీని కూడా రియింబర్స్ చేస్తోంది. తాజాగా ఈ తాడేపల్లి సీఎం కార్యాలయం నుండి బటన్ నొక్కి వడ్డీ డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమచేసారు సీఎం జగన్. ఇప్పటికే ఈ ఇళ్ల పథకం కింద 12.77 లక్షల మంది లబ్దిదారులకు రూ.4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించింది ప్రభుత్వం. వీరిలో అర్హులైన 4,07,323 మంది లబ్దిదారులకు ఈ దపా వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.90 కోట్లను విడుదల చేసారు సీఎం జగన్. మంత్రి జోగి రమేష్, సీఎస్ జవహర్ రెడ్డితో పాటు గృహనిర్మాణ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ కు వేదిక‌వుతున్న 'న్యూయార్క్ నాసావు కౌంటీ స్టేడియం 

ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచ క‌ప్-2024లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనున్న నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఫొటోల‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) ఆవిష్క‌రించింది. రాబోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024కు వెస్టిండీస్ తో పాటు యూఎస్ఏ కూడా ఆతిథ్యం ఇస్తోంది. 


టీ20 ప్రపంచకప్ ఆడే 10 మంది ఆటగాళ్లు ఫైనల్..  ! 

World Cup-Team India:టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024కు సంబంధించిన‌ ఏర్పాట్లను ఐసీసీ సిద్ధం చేస్తోంది. ఈ సారి వెస్టిండీస్, యూఎస్ఏ వేదిక‌గా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 జ‌ర‌గ‌నుంది. 2023 వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ చేజారినా.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 ను మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లో కోల్పోకూడ‌ద‌ని భార‌త్ ప్రాణాళిక‌లు సిద్ధం చేస్తోంది. అయితే, వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌బోయే టీమిండియాలో ఏ ప్లేయ‌ర్స్ ఉంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్ర‌మంలోనే భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ సిరీస్ ముగిసిన త‌ర్వాత భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆ ఐసీసీ మెగా టోర్నమెంట్ కు ఎంపికయ్యే 15 మంది ఆటగాళ్ల గురించి ఒక‌ హింట్ ఇచ్చాడు. అందులో 8 నుంచి 10 మంది ఆటగాళ్ల పేర్లు ఇప్పటికే త‌న మ‌దిలో ఉన్నాయ‌ని పేర్కొన్నాడు.
 

click me!