India today exit polls: మహారాష్ట్రలో బీజేపీదే హవా

Published : Oct 21, 2019, 06:37 PM ISTUpdated : Oct 21, 2019, 07:27 PM IST
India today exit polls: మహారాష్ట్రలో బీజేపీదే  హవా

సారాంశం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం దిశగా అడుగులు వేయనుందని ఇండియా టుడే ఎగ్జిట్ ఫలితాలను వెల్లడిస్తోంది.

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 288 స్థానాలకు సోమవారం నాడు జరిగిన ఎన్నికల్లో  బీజేపీ శివసేన కూటమి విజయం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.

బీజేపీ, శివసేన 166-194
కాంగ్రెస్ 72-90
ఇతరులు  22-34

Read more ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్రలో బీజేపీ విజయదుందుభి...

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

Read more #ExitPolls న్యూస్ 24 సర్వే: మరాఠాల చూపు కమలంవైపే...

మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. 

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది. 

PREV
click me!

Recommended Stories

Bank Jobs : మంచి మార్కులుండి, తెలుగులో మాట్లాడితే చాలు.. రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్
Budget Friendly Cars : కొత్తగా జాబ్ లో చేరినవారు కూడా కొనగలిగే టాప్ 5 కార్లు ఇవే..