Agni-IV క్షిపణి పరీక్ష విజయవంతం.. ‘4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు’

Published : Jun 06, 2022, 11:25 PM IST
Agni-IV క్షిపణి పరీక్ష విజయవంతం.. ‘4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు’

సారాంశం

భారత రక్షణ శాఖ ఈ రోజు సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ఒడిశా తీరంలో అగ్ని 4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది. 

న్యూఢిల్లీ: భారత రక్షణ శాఖ విజయవంతంగా అగ్ని 4 బాలిస్టిక్ మిసైల్‌ను పరీక్షించింది. ఈ మిసైల్ న్యూక్లియర్ పేలుడునూ తీసుకెళ్లే సామర్థ్యం గలది. ఒడిశా తీరంలో ఈ రోజు అగ్ని 4 క్షిపణని పరీక్షించారు. ఇది విజయవంతంగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. అగ్ని 4 క్షిపణి 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించగలదు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూరిందని భారత రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

భారత రక్షణ సామర్థ్యాన్ని ఈ పరీక్ష మరోసారి వెల్లడించిందని భారత రక్షణ శాఖ తెలిపింది. ఈ రోజు సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో అగ్ని 4 క్షిపణిని ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతంగా సాగింది.

అగ్ని క్షిపణుల సిరీస్‌లో అగ్ని 4 మిసైల్ నాలుగోది. ఇంతకు ముందు ఈ క్షిపణిని అ్నగి 2 ప్రైమ్‌గా వ్యవహరించేవారు. ఈ మిసైల్‌ను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.

గతేడాది భారత దేశం న్యూక్లియర్ సామర్థ్య గల అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల టార్గెట్‌ను ధ్వంసం చేసే సామర్థ్యం గలది. సరికొత్త సాంకేతికత, సామర్థ్యాలను వినియోగించుకుని భారత్ మరిన్ని వ్యూహాత్మక క్షిపణులను అభివృద్ధి చేస్తూ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాలను పెంచుకుంటున్నది.

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM