గుడ్‌న్యూస్: అమెరికా ప్రయాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్, రేపటి నుంచే సర్వీసులు

Siva Kodati |  
Published : Jul 16, 2020, 08:36 PM ISTUpdated : Jul 16, 2020, 08:37 PM IST
గుడ్‌న్యూస్: అమెరికా ప్రయాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్, రేపటి నుంచే సర్వీసులు

సారాంశం

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఒప్పందం కుదిరిన దేశాలు తమ విమాన సర్వీసులను నడపనున్నాయి. శుక్రవారం నుంచే ఈ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.

ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య 18 విమానాలను నడపనుంది. ఎయిర్‌ఫ్రాన్స్ సైతం జూలై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమానాలను నడపనుందని పురి వెల్లడించారు. ఢిల్లీ- న్యూయార్క్ మధ్య ప్రతిరోజూ , ఢిల్లీ- శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజుల పాటు విమానాలు నడవనున్నాయని ఆయన చెప్పారు.

ఈ తరహా ఒప్పందానికి ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ, ఆచితూచి అడుగులు వేస్తున్నామని పురి తెలిపారు. కాగా కోవిడ్ కారణంగా దేశంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu