రాజీనామా చేసి... థియేటర్ లో సినిమా ఎంజాయ్ చేసిన రాహుల్

Published : Jul 06, 2019, 09:47 AM IST
రాజీనామా చేసి... థియేటర్ లో సినిమా ఎంజాయ్ చేసిన రాహుల్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన తర్వాత తీరిగ్గా ఎంజాయ్ చేస్తున్నాడు. రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఎంత కోరినా... వెనక్కి తగ్గలేదు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన తర్వాత తీరిగ్గా ఎంజాయ్ చేస్తున్నాడు. రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఎంత కోరినా... వెనక్కి తగ్గలేదు. పార్టీ ఓటమికి తనను తాను బాధ్యుడ్ని చేసుకుంటూ.. అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాహుల్ బహిరంగ లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. 

కాగా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రాహుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలా లేఖ రాసిన మర్నాడే రాహుల్ ఓ సామాన్యుడిలా సినిమాకెళ్లిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.  

రాహుల్ చాలా కూల్‌గా ఓ సామాన్యుడిలా ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్‌కి వెళ్లి ‘ఆర్టికల్ 15’ సినిమా చూడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రాహుల్ థియేటర్‌లో పాప్‌కార్న్ తింటూ సినిమాను ఎంజాయ్ చేసిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా సామాన్యుడిలా థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి రాహుల్ సినిమా చూడటంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Mumbai Family Death: వీడిన పుచ్చ‌కాయ‌, బిర్యానీ మ‌ర‌ణాల మిస్ట‌రీ.. ఇంత‌కీ వాళ్లు ఎలా చ‌నిపోయారంటే
సీఎం ఎవరు? ఉత్కంఠ రేపుతున్నతమిళ రాజకీయాలు| Tamil Nadu Political Mind Blowing Twist | Asianet Telugu