జీన్స్ వేసుకుందని... డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా...

By telugu teamFirst Published Oct 22, 2019, 1:49 PM IST
Highlights

మరో యువతి కొంచెం పొట్టిగా ఉన్న డ్రస్ వేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లింది. ఆమెను కూడా డ్రస్ సరిగా లేదంటూ ఇవ్వనని తేల్చి చెప్పాడు. దీంతో సదరు యువతి కాసేపు అతనితో వాగ్వాదానికి దిగింది. అయినా ఆ ఆర్టీఓ అధికారి వెనక్కి తగ్గకపోవడంతో... ఆమె కూడా ఇంటికి వెళ్లి సల్వార్ కమీజ్ వేసుకొని మళ్లీ ఆర్టీవో ఆఫీసుకి వచ్చి లైసెన్స్ తీసుకువెళ్లింది.

జీన్స్  వేసుకుందని ఓ ఆర్టీవో ఆఫీసర్..  యువతికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. తర్వాత యువతి ఇంటికి వెళ్లి మళ్లీ సల్వార్ కమీజ్ వేసుకొని వస్తే... ఆయన లైసెన్స్ ఇవ్వడం విశేషం. ఇదే సంఘటన ఇద్దరు యువతులకు చోటుచేసుకుంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చెన్నైకి చెందిన ఓ టెక్కీ... డ్రైవింగ్ లైసెన్స్ కోసం కేకే నగర్ ఆర్టీవో ఆఫీసుకి వెళ్లింది. కాగా... ఆ సమయంలో ఆమె జీన్స్ ధరించి ఉంది. ఆ కారణంతో డ్రెస్ సరిగా లేదని ఆమెకు ఆర్టీవో లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో.. సదరు యువతి ఇంటికి వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చి లైసెస్స్ తీసుకుంది.

మరో యువతి కొంచెం పొట్టిగా ఉన్న డ్రస్ వేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లింది. ఆమెను కూడా డ్రస్ సరిగా లేదంటూ ఇవ్వనని తేల్చి చెప్పాడు. దీంతో సదరు యువతి కాసేపు అతనితో వాగ్వాదానికి దిగింది. అయినా ఆ ఆర్టీఓ అధికారి వెనక్కి తగ్గకపోవడంతో... ఆమె కూడా ఇంటికి వెళ్లి సల్వార్ కమీజ్ వేసుకొని మళ్లీ ఆర్టీవో ఆఫీసుకి వచ్చి లైసెన్స్ తీసుకువెళ్లింది.

ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ... తనకు డ్రైవింగ్ లైసెన్స్ అత్యవసరమైందని.... అందుకే తప్పకుండా వెళ్లి తన డ్రెస్ మార్చుకొని వచ్చానని తెలిపింది. కాగా... ఆ ఇద్దరు యువతులు సదరు ఆర్టీవో పై ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే... డ్రైవింగ్ లైసెన్స్ కి యువతుల దుస్తులకు ఎలాంటి సంబంధం లేదని ఆర్టీవో అధికారులు చెబుతున్నారు.

కేవలం 18 సంవత్సరాలు నిండి ఉంటే... వాహనం సరిగ్గా నడిపితే వారికి లైసెన్స్ ఇస్తామని... వాళ్లు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో చూడమని..చెబుతున్నారు. 

click me!