హరియాణా పాలిటిక్స్: రెండోసారి సీఎంగా ఖట్టర్, డిప్యూటీ సీఎంగా నైనా చౌతలా

By Nagaraju penumalaFirst Published Oct 26, 2019, 4:05 PM IST
Highlights

జేజీపీ అధినేత దుష్యంత్ చౌతలా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ కట్టలాల్ భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి పదవిపై చర్చించారు. దుష్యంత్ చౌతలా తల్లి నైనా చౌతలా డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 

చండీఘర్: హరియాణాలో ఎట్టకేలకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో హంగ్ ఏర్పడటంతో ప్రభుత్వం ఏర్పాటుపై అటు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు వ్యూహరచన చేశారు. 

అయితే జేజేపీ, స్వతంత్రులు కీలకంగా మారడంతో వారు ఎవరికి మద్దతు ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఎన్నికల్లో 10 స్థానాల్లో విజయం సాధించిన జేజేపీ బీజేపీకి మద్దతు ప్రకటించింది. 

ఈనేపథ్యంలో జేజీపీ అధినేత దుష్యంత్ చౌతలా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ కట్టలాల్ భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి పదవిపై చర్చించారు. దుష్యంత్ చౌతలా తల్లి నైనా చౌతలా డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 అనంతరం ఇద్దరు నేతలు కలిసి గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. అసెంబ్లీలో తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉందని స్పష్టం చేస్తూ లేఖ ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నాం మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అంతకుముందు బీజేఎల్పీ సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బీజేఎల్పీ నేతగా మరోసారి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఎన్నుకున్నారు బీజేపీ నేతలు.  

ఇకపోతే హరియాణాలో బీజేపీకి మద్దతు ఇచ్చిన జేజీపీకి ఉపముఖ్యమంత్రి పదవి దక్కిందని తెలుస్తోంది. జేజీపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతలా తల్లి నైనా చౌతలాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

నైనా చౌతలా బాధ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గతంలో కూడా ఐఎన్ఎల్డీ పార్టీ నుంచి బాధ్రా నియోజకవర్గం నుంచి కూడా గెలుపొందారు నైనా చౌతలా. అంతా దుష్యంత్ చౌతలా డిప్యూటీ సీఎం అవుతారని భావించిన నేపథ్యంలో నైనా చౌతలా పేరు తెరపైకి రావడంపై చర్చ జరుగుతుంది.  

హరియాణా ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అసెంబ్లీలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలున్న సంగతి తెలిసందే. ఇకపోతే హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అసెంబ్లీలో 46 సభ్యుల బలం ఉండాలి. అయితే జేజీపీ మద్దతుతో బీజేపీకి 50 మంది సభ్యుల బలం ఉంది. 

ఈ వార్తలు కూడా చదవండి

హర్యానా: స్వతంత్రులను లాగేసిన బీజేపీ..రేపు ఖట్టర్ ప్రమాణ స్వీకారం..?..

అమిత్ షా స్ట్రాటజీ.. బీజేపీకి జైకొట్టిన దుష్యంత్: ఖంగుతిన్న కాంగ్రెస్.

click me!