వివాహితతో అక్రమ సంబంధం.. నీలదీసిన భార్యను..

Published : Oct 30, 2018, 12:25 PM IST
వివాహితతో అక్రమ సంబంధం.. నీలదీసిన భార్యను..

సారాంశం

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదని.. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భార్య నిలదీసిందని.. ఆమెను 8వ అంతస్థు నుంచి కిందకు తోసేసాడు. 

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదని.. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భార్య నిలదీసిందని.. ఆమెను 8వ అంతస్థు నుంచి కిందకు తోసేసాడు. ఈ సంఘటన హర్యానాలోని గుర్గావ్‌ ఫరిదాబాద్‌ రోడ్‌ సమీపంలోని అన్సాల్‌ వ్యాలీలో గత శనివారం చోటుచేసుకుంది. కర్వాచౌత్ రోజే.. ఆమె ని భర్త దారుణంగా హత్య చేయడం గమనార్హం.

విక్రమ్‌ చౌహన్‌ అనే ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి తన సతీమణి దీపికను 8వ అంతస్తు నుంచి నెట్టేసి చంపాడు. మృతురాలి తండ్రి అహుజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచి రెండురోజులు కస్టడీలోకి తీసుకున్నారు. 

దీపిక తండ్రి అహుజా మీడియాతో మాట్లాడుతూ.. విక్రమ్‌ చౌహన్‌, దీపికలు 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారని, వారికి నాలుగేళ్ల కూతురు, ఆరునెలల బాలుడున్నారని తెలిపారు. వారి నివాసం పక్కనే నివసించే ఓ మహిళతో విక్రమ్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ, సదరు మహిళ తరుచూ వారి ఫ్లాట్‌కు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయన్నారు. ఈ విషయంపై తన కూతురు నిలదీయడంతో దారుణంగా కొట్టి, కర్వా చౌత్‌ సాకుగా బాల్కనీ నుంచి తోసేశాడని కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu