తమ్ముడి భార్యపై కన్నేసిన కామాంధుడు... నాలుగేళ్లుగా

Published : Sep 30, 2019, 09:03 AM IST
తమ్ముడి భార్యపై కన్నేసిన కామాంధుడు... నాలుగేళ్లుగా

సారాంశం

వ్యాపారం రీత్యా తమ్ముడు ప్రతి రోజు  ఉదయం బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే వాడు. ఇదే అదునుగా భావించిన అన్నయ్య.. ఓ రోజు ఒంటరిగా ఉన్న మరదలు దగ్గరకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు సహకరించకుంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు.

అన్న భార్య తల్లిలాంటిదని... తమ్ముడి భార్య కూతురితో సమానమని చెబుతుంటారు మన పెద్దలు. అయితే... అలాంటి బంధుత్వాలని మరచి ఓ వ్యక్తి పశువుగా మారాడు. తమ్ముడి భార్యపై కన్నేసి నాలుగేళ్లుగా తన కోరిక తీర్చుకున్నాడు. ఈ దారుణ సంఘటన గురుగ్రామ్ నగరంలోని బజ్గేరా గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...బజ్గేరా గ్రామానికి చెందిన ఓ వ్యాపారి భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అతని ఇంటి సమీపంలోనే వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తరచూ తమ్ముడి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో తమ్ముడి భార్యపై కన్నేశాడు. 

వ్యాపారం రీత్యా తమ్ముడు ప్రతి రోజు  ఉదయం బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే వాడు. ఇదే అదునుగా భావించిన అన్నయ్య.. ఓ రోజు ఒంటరిగా ఉన్న మరదలు దగ్గరకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు సహకరించకుంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. తన పిల్లలకు, భర్తకు ఎక్కడ హాని తలపెడుతాడో అనే భయంతో ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.

 అయితే ఇటీవల అతని వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో చేసేది ఏమిలేక గత శుక్రవారం ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పారు. దీంతో ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇచ్చారు. చంపేస్తానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works