ప్రేమజంటను చెట్టుకు కట్టేసి, చిత్రహింసలు.. వీడియో తీసి...

Published : Jul 22, 2021, 02:40 PM IST
ప్రేమజంటను చెట్టుకు కట్టేసి, చిత్రహింసలు.. వీడియో తీసి...

సారాంశం

ఇంట్లో నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంట కు దారుణమైన శిక్ష విధించారు కొందరు వ్యక్తులు. ఇద్దర్నీ చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. గుజరాత్లోని చౌతౌదేపూర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

గాంధీనగర్ : గుజరాత్ లో దారుణం జరిగింది. ప్రేమించుకోవడం ఆ జంట పాలిట శాపంగా మారింది. పెద్దలు ఒప్పుకోలేదని పారిపోవడమే వారి నేరం అయ్యింది. ప్రేమించుకున్న పాపానికి చిత్రహింసలకు గురయ్యారు. ఈ దారుణమైన ఘటన వీడియో వైరల్ అయ్యింది. 

ఇంట్లో నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంట కు దారుణమైన శిక్ష విధించారు కొందరు వ్యక్తులు. ఇద్దర్నీ చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. గుజరాత్లోని చౌతౌదేపూర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం  గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట  జూలై 18న ఇంటి నుంచి పారిపోయింది. వారిని వెతికి పట్టుకున్న కొందరు ఊరికి తీసుకు వచ్చారు. చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు.  పెద్దపెద్ద కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. వాళ్ల దెబ్బలు తాళలేక హృదయవిదారకంగా కేకలు పెడుతున్నా వదలలేదు. 

చుట్టూ మూగిన జనం అడ్డు చెప్పాల్సింది పోయి సినిమా చూసినట్లు చూశారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  దీంతో పోలీసులు వెళ్లారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.  వారి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
 
PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు