పట్టాలపై స్పృహతప్పి పడిపోయిన మహిళ.. అంతలోనే  దూసుకొచ్చిన రైలు.. లక్కీగా.. 

Published : Jul 03, 2023, 05:56 AM IST
పట్టాలపై స్పృహతప్పి పడిపోయిన మహిళ.. అంతలోనే  దూసుకొచ్చిన రైలు.. లక్కీగా.. 

సారాంశం

ఓ మహిళ స్పృహతప్పి రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఇంతలో ఓ గూడ్సు రైలు ట్రాక్‌పై నుంచి దూసుకెళ్లింది. అయినా.. ఆమె మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఓ మహిళ ఆకస్మాత్తుగా స్పృహతప్పి రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఇంతలో ఓ రైలు ఆమె పడిపోయిన ట్రాక్‌పై నుంచి దూసుకెళ్లింది. 30 సెకన్ల పాటు ఆ మహిళ రైల్వే ట్రాక్ మధ్యలో గూడ్స్ రైలు కింద పడి ఉంది. ఆమె మృత్యువును చాలా అంటే.. చాలా దగ్గరగా చూసింది. ఆమె పై నుంచి రైలు వెళ్లినా.. ఆమె మాత్రం ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల్లోకెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఆర్య నగర్‌కు చెందిన 40 ఏళ్ల హర్ప్యారీ..  మందులు తీసుకెళ్లాడానికి సహవర్‌ రైల్వేస్టేషన్‌ వైపు వెళ్లింది. పట్టాలు దాటుతుండగా..  ట్రాక్ పై గూడ్స్ రైలు వస్తున్నా పట్టించుకోలేదు. ఆమె ట్రాక్ దాటబోతుండగా సడెన్ గా  గూడ్స్ రైలు వచ్చింది. గూడ్స్ రైలును చూసి హర్ప్యారీ భయపడి ట్రాక్‌పైనే పడిపోయాడు. ఆమెను రైల్వే ట్రాక్‌పై నుంచి పక్కకు తీసేందుకు కొందరు వ్యక్తులు పరుగెత్తారు.

అంతలోనే మరో గూడ్సు రైలు ఆమె పడిపోయిన ట్రాక్ పైకి వచ్చింది. దీంతో చేసేదేమీ లేక ఊరుకున్నారు. ఆమె పై నుంచి రైలు వెళ్తుండగా.. ఆమెకు మెలుకువ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు.. కాళ్లు, చేతులు కదపకుండా అలాగే ఉండాలంటూ.. కేకలు వేశారు. హర్ప్యారీ 30 సెకన్ల పాటు గూడ్స్ రైలు కింద పడి ఉన్నాడు. అప్పుడే సమాచారం అందిన వెంటనే లోకో పైలట్ రైలును ఆపేశాడు. అక్కడే ఉన్న ప్రజలు అతడిని బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఆమె ట్రాక్ మధ్యలో పడిపోయింది.దీంతో ఆమె  స్వల్ప గాయాలతో బయటపడింది. లేదంటే.. ఘోరం జరిగింది.  ఇప్పుడు హర్ప్యారీ కు  సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

80వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech
ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సిల్స్ | Red Fort Independence Day rehearsal