మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం

By telugu teamFirst Published Sep 30, 2019, 1:18 PM IST
Highlights

విమానంలో గోవా పర్యవరణ శాఖ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్‌లో మంటలంటుకున్నాయని మంత్రి నీలేశ్‌ తెలిపారు. 

ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  అయితే.... వెంటనే అప్రమత్తమైన పైలెట్.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా... ఆ సమయంలో విమానంలో గోవా పర్యవరణ శాఖ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్‌లో మంటలంటుకున్నాయని మంత్రి నీలేశ్‌ తెలిపారు. 

పైలట్ వెంటనే ఎడమ ఇంజీన్‌ ఆపివేసి తమను తిరిగి గోవాకు ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు.  తనతో సహా మిగిలిన 180 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అధికారిక సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు మంత్రి  చెప్పారు.

click me!