
Shashi Tharoor: ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార సంక్షోభం ఏర్పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యులు, యూఎన్ మాజీ అధికారి శశి థరూర్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచంలో గోధుమ సంక్షోభం ఏర్పడిందని, దాదాపు 30 శాతం పంటలు పండించే అవకాశం లేకుండా ఉందని పేర్కొంటున్న FAO నివేదికను ఉటంకిస్తూ వెల్లడించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు.
ఒక ట్వీట్‌లో శశి థరూర్.. “ప్రపంచంలోని గోధుమలలో దాదాపు 30 శాతం, మొక్కజొన్నలో 17 శాతం మరియు సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ ఎగుమతుల్లో సగానికిపైగా ఉక్రెయిన్ & రష్యా వాటా ఉంది. యుద్ధం వల్ల ఇవి బాగా తగ్గిపోయాయి. దీనికారణంగా పరిస్థితులు అధ్వాన్నంగా మారి.. ఈ సంవత్సరం పంటలో 20-30 శాతం యుద్ధం కారణంగా పండించే అవకాశం లేదనే @FAO అంచనా వేసింది. ప్రపంచ ఆహార సంక్షోభం ఏర్పడుతుంది" అని పేర్కొన్నారు.
అలాగే, "ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ ప్రపంచ ఆహార భద్రతకు మరింత ముప్పు కలిగిస్తోందని, ఆహార ధరలు ఇప్పటికే ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని ఆయన చెప్పారు.
ఇదిలావుండగా, ఉక్రెయిన్ ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) అత్యవసర సమన్వయకర్త జాకోబ్ కెర్న్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అతిపెద్ద మరియు నాల్గవ అతిపెద్ద గోధుమ ఎగుమతిదారులు వరుసగా రష్యా, ఉక్రెయిన్ ఉన్నాయని తెలిపారు. దాదాపు 29 శాతం వాటాను కలిగి ఉన్నాయని తెలిపారు. కాబట్టి ప్రపంచంలోని అనేక దేశాల ఆహార భద్రతను నిర్ధారించడంలో రెండు దేశాలు కీలకమైనవిగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా దేశాల యుద్ధం ప్రభావం ప్రపంచ ఆహార గోలుసు పై పడిందని అన్నారు. మున్ముందు పరిస్థితులు ఇలాంటే ఉంటే పరిస్థితి దారుణంగా మారుతుందని తెలిపారు.
ఆ వివాదం ప్రారంభమైనప్పటి నుండి గ్లోబల్ ఫుడ్ మరియు ఇంధన ధరలు బాగా పెరిగాయని కెర్న్ చెప్పారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం.. ఫిబ్రవరి 2022లో ఇవి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 15 వరకు గోధుమల ధర 24 శాతం పెరిగిందని కెర్న్ చెప్పారు. "ఈ పెంపుదల స్థానిక ఆహార ధరలను ప్రభావితం చేస్తుంది మరియు వీటి ద్వారా ఆహారాన్ని పొందడం, ముఖ్యంగా ఇప్పటికే టేబుల్‌పై ఆహారాన్ని ఉంచడానికి కష్టపడుతున్న మిలియన్ల మంది ప్రజలకు మరింత కష్టంగా మారుతుందని" అన్నారు.