గ్లూకోజ్ బాటిల్‌లో ఫంగస్.. చివరి నిమిషంలో గుర్తించిన వైద్యులు, లేదంటే

By sivanagaprasad kodatiFirst Published Jan 8, 2019, 11:31 AM IST
Highlights

తమిళనాడులోని ఓ ప్రభుత్వాసుపత్రిలో గర్భిణికి హెచ్ఐవీ రక్తం ఎక్కించడం, ఆ విషయం తెలిసి రక్తదాత ఆత్మహత్య చేసుకోవడం పెద్ద దుమారాన్ని రేపింది. తాజాగా ఢిల్లీలో రోగికి ఎక్కించాల్సిన గ్లూకోజ్ బాటిల్‌లో ఫంగస్ ఉండటం దానిని చివరి నిమిషంలో గుర్తించడంతో పెద్దగండం తప్పింది. 

నగరంలోని అరుణా ఆసఫ్ అలీ ప్రభుత్వాసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగం ఒక రోగికి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం నర్సింగ్ స్టాఫ్ ఆసుపత్రిలోని మెడికల్ స్టోర్ నుంచి గ్లూకోజ్ డెట్రాక్స్ నార్మల్ సెలైన్ బాటిల్స్‌ను తెప్పించారు.

రోగికి ఎక్కించబోతుండగా చివరి నిమిషంలో ఆ బాటిల్‌లో ఫంగస్ ఉండటాన్ని గమనించారు. వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. అప్రమత్తమైన అధికారులు ఆ బ్యాచ్‌కు చెందిన అన్ని గ్లూకోజ్ బాటిళ్లను ల్యాబ్‌కు పంపారు. 
 
click me!