భార‌తమాల ప్రాజెక్టు కింద నాలుగు నేష‌న‌ల్ హైవేలు మంజారు.. తెలుగు రాష్ట్రాల‌కు ఒక్కోటి చొప్పున కేటాయింపు

Published : Feb 23, 2022, 05:33 AM IST
భార‌తమాల ప్రాజెక్టు కింద నాలుగు నేష‌న‌ల్ హైవేలు మంజారు.. తెలుగు రాష్ట్రాల‌కు ఒక్కోటి చొప్పున కేటాయింపు

సారాంశం

భారతమాల ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం హైవేలను మంగళవారం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరాలు వెల్లడించారు. 

భారతమాల ప్రాజెక్టు కింద రూ.4,518.04 కోట్ల విలువైన నాలుగు హైవే ప్రాజెక్టులను కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసింది. ప్రతిపాదిత హైవేలు అస్సాం, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari) వివరాలు వెల్లడించారు. 

ప్రస్తుతం మంజూరైన నాలుగింటిల్లో అతి పెద్దది ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించబడింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి పీలేరు వరకు NH-71 నాలుగు లైన్ల నిర్మాణానికి 1,852.12 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 972.06 కోట్ల అంచనా వ్యయంతో కర్ణాటక మరియు తెలంగాణల మధ్య NH-150C యొక్క ఆరు లైన్ల, యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే సెక్షన్‌ను కూడా నిర్మించనున్నారు. అస్సాంలో రూ. 1,694 కోట్ల విలువైన రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ. 1,522.91 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు-లేన్ల నిర్మాణం, NH-127B అప్‌గ్రేడేషన్ లు ఉన్నాయి. 

భారతమాల ప్రాజెక్ట్ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపడుతున్న పథకం. దేశవ్యాప్తంగా సరుకు రవాణా, ప్రయాణీకుల ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు రూపొందించింది. మొదటి దశలో 34,800 కిలోమీటర్ల ఆర్థిక కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు, సరిహద్దు, అంతర్జాతీయ కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధిని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

భారత్‌మాల ప్రాజెక్టు మొదటి దశ కింద ప్రభుత్వం డిసెంబర్‌ వరకు రూ.5.60 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా 6,750 కిలోమీటర్ల ప్రాజెక్టుల అభివృద్ధి పూర్తయిందని గ‌త  డిసెంబర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

2022-23 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను ఆర్థిక సంవత్సరంలో 25,000 కి.మీల మేర విస్తరించాలని ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 68 శాతం పెరిగి రూ.1.99 ట్రిలియన్లకు చేరాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?