INX Media case: చిదంబరంకు ఊరట, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు

By Nagaraju penumalaFirst Published Oct 22, 2019, 10:47 AM IST
Highlights

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  చిదంబరం బెయిల్ పిటీషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

చిదంబరం బెయిల్ పిటీషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. 

మరోవైపు చిదంబరంపై సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల24న చిదంబరాన్ని కోర్టు ముందు హాజరు పర్చాల్చిందిగా అధికారులను ఆదేశించింది ధర్మాసనం. 

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా నోటీసులు పంపింది ఢిల్లీ హైకోర్టు. ఇకపోతే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరం, పీటర్ ముఖర్జియాలతోపాటు ఇతర నిందితులకు రౌజ్ ఎవెన్యూ కాంప్లెక్స్‌లోని ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపోతే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రెండు నెలలుగా చిదంబరం తీహార్ జైల్లో ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ పై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కీలకమైన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ వస్తేనే చిదంబరం రాగలరు.   

ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఈనెల 24 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు చిదంబరం.

బెయిల్ మంజూరుకు సంబంధించి కోర్టు కండీషన్స్ పెట్టింది. లక్ష రూపాయల సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఇకపోతే రిమాండ్ అనంతరం ఈనెల 24న బెయిల్ పై విడుదల కానున్నారు చిదంబరం. 

ఇటీవలే అనారోగ్యానికి సైతం గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడ్డ ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. ఇకపోతే చిదంబరానికి ఇంటి నుంచి వచ్చిన భోజనం తినేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. 

click me!