
ముంబై: టాటా సన్స్ గ్రూప్ మాజీ చైర్మెన్ సైరస్ మిస్త్రీ ఆదివారం నాడు మృతి చెందాడు. ముంబైకి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో సైరన్ మిస్త్రీ మరణించాడు. ఆయన వయస్సు 54 ఏళ్లు.సైరస్ మిస్త్రీకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అహ్మాదాబాద్ నుండి ముంబైకి తన కారులో మిస్త్రీ వస్తున్న సమయంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సూర్య నది వంతెనపై ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తో పాటు కారులోని ఇద్దరు గాయపడి చికిత్స పొందుతున్నారు.పాల్ఘర్ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ మరణించారని పాల్ఘర్ ఎస్పీ ధృవీకరించారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో మిస్త్రీ సహా నలుగురున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రమాదం జరిగిందని అనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు.
1968 జూలై 4న సైరస్ మిస్త్రీ ముంబైలో జన్మించారు. వ్యాపార దిగ్గజం షాపూర్ జీ పల్లోంజీ కొడుకు సైరస్ మిస్త్రీ.2012-16 మద్య కాలంలో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మెన్ గా పనిచేశారు. రతన్ టాటాతో విబేధించి టాటాసన్స్ గ్రూప్ నుండి సైరస్ మిస్త్రీ బయటకు వచ్చాడు. మిస్త్రీ మరణంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. షిండే మరణం పెద్ద నష్టంగా ఆయన పేర్కొన్నారు.