భర్త కళ్ల ముందే... భార్యపై సామూహిక అత్యాచారం..

సమాజంలో ఆడవారికి రక్షణ కరువైపోతోంది. ఓ వ్యక్తిని కొట్టి అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో జరిగింది.  
 


సమాజంలో ఆడవారికి రక్షణ కరువైపోతోంది. ఆడవారు రోడ్డు మీదకు వెళ్లి క్షేమంగా ఇంటికి చేరడమే కష్టతరంగా మారిపోతోంది. ప్రభుత్వాలు ఎన్ని పటిష్టమైన చట్టాలు తీసుకువస్తున్నా.. కఠిన శిక్షలను విధిస్తున్నా.. నేరం చేయాలనే ఆలోచన వచ్చిన వారిలో మార్పు రావడం లేదు. ప్రతి రోజు ఎంతోమంది చిన్నారులు, మహిళలు మృగాళ్ల బారిన పడుతోన్నారు.

ఈ క్రమంలో కొందరూ బాధితులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు జీవచ్ఛవాలుగా బతుకు లీడుస్తున్నారు.  తాజాగా ఒడిశాలో ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. భర్త కళ్ల ముందే ఓ మహిళకు అన్యాయం జరిగింది. బైక్ పై వెళ్తున్న భార్యాభర్తల్ని దుండగులు ఆపి.. వారిపై దాడి చేసి.. ఆ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన  స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Latest Videos

వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఒరిస్సాలోని దెంకనల్ జిల్లాలో చేటు చేసుకుంది. బారువా భువన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాశాలలో చదువుతున్న వివాహిత చదువు ముగించుకుని కలియపాణిలోని తన ఇంటికి తిరిగి వస్తోంది. మహిళ వెంట ఆమె భర్త కూడా ఉన్నాడు. బైక్‌పై వెళ్తున్న ఆ దంపతులు అడవి ప్రాంతంలో ఐదుగురు దుండగులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె భర్తను చావబాదారు.  మహిళను అడవిలోకి లాగారు. ఇక్కడ అందరూ వంతులవారీగా భర్త ఎదుటే బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ సమయంలో బాధితురాలిని కాపాడేందుకు ఆమె భర్త తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో నిందితులు మహిళ, ఆమె భర్త వద్ద ఉన్న పర్సు, మొబైల్ ఫోన్‌ను దోచుకెళ్లారు. బాధితులిద్దరూ ఎలాగోలా ఘటనా స్థలం నుంచి తప్పించుకుని భువన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇక్కడ మహిళ తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

స్థానిక న్యూస్ ప్రకారం.. బాధితుల వద్ద నగదు లేనప్పుడు, నిందితులు యుపిఐ ద్వారా డబ్బును కూడా ఖాతాలోకి మార్చుకున్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గుర్తు తెలియని నిందితులను గుర్తించి వెతకడం ప్రారంభించారు.  
 

click me!