Arun Kumar P   | Asianet News
Published : Mar 10, 2022, 06:40 AM ISTUpdated : Mar 10, 2022, 08:26 PM IST

Five States election results 2022 live update: మహిళలు ఓట్లేసిన చోట బీజేపీకి విక్టరీ: ప్రధాని నరేంద్ర మోడీ

సారాంశం

న్యూడిల్లి: దేశరాజకీయాలను అత్యంత ప్రభావితం చేసే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(గురువారం) వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లో ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్,ఉత్తరాఖండ్, గోవా, మణిఫూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈవీఎంలలో నిక్షితమైన వివిధ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపు  కోసం ఎన్నికల కమీషపన్ అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేసింది.


 

08:26 PM (IST) Mar 10

స్త్రీ శక్తే నాకు రక్షణ కవచం

మహిళలు అధికంగా ఓట్లేసిన చోట బీజేపీ బంపర్ విక్టరీ కొట్టిందని ప్రధాని అన్నారు. తనకు స్త్రీ శక్తి అనే కవచం లభించిందని.. కులాల పేరుతో ఓట్లు అడిగి కొన్ని పార్టీలు యూపీ ప్రజల్ని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని.. కులం, జాతి అనేది దేశ ప్రగతికి ఉపయోగపడాలి కానీ, విచ్ఛిన్నానికి కాదని ప్రధాని సూచించారు.

07:47 PM (IST) Mar 10

ప్రధాని మోడీపై పూల వర్షం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్న ప్రధాని మోడీపై బీజేపీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. 
 

05:41 PM (IST) Mar 10

ఉత్తరాఖండ్ లో సీఎం, మాజీ సీఎం ఓటమి

ఉత్తరాఖండ్ లో హేమాహేమీలు ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం సీఎం పుష్కర్ సింగ్ దామితో పాటు మాజీ సీఎం హరీష్ రావత్ కూడా  ఓడిపోయారు.


 

05:38 PM (IST) Mar 10

డిల్లీ నుండి పంజాబ్ కు... ఇదే స్పూర్తితో దేశమంతా: ఎన్నికల పలితాలపై కేజ్రీవాల్

పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని అక్కున చేర్చుకుని అద్భుత విజయం అందించారని డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. డిల్లీలో ప్రారంభించి ఇప్పుడు పంజాబ్ కు వచ్చామని... ఇదే స్పూర్తి దేశం మొత్తం రావాలన్నారు. సెల్ ఫోన్ రిపేర్ షాప్ లో పనిచేసే అతి సామాన్యుడి చేతిలో సీఎం చన్నీ ఓడిపోయారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

05:32 PM (IST) Mar 10

మణిపూర్ సీఎం బీరెన్ ఘనవిజయం

మణిపూర్ ముఖ్యమంత్రి బీరున్ సింగ్ 17వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

 
 

05:25 PM (IST) Mar 10

6750ఓట్ల తేడాతో పంజాబ్ పిసిసి చీఫ్ సిద్దూ పరాజయం

అమృత్ సర్ ఈస్ట్ లో పోటీచేసిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ 6750ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 
 

05:22 PM (IST) Mar 10

61వేల మెజారిటీలో అఖిలేష్ ఘనవిజయం

కర్హల్ నియోజకవర్గం నుండి పోటీచేసిన సమాజ్ వాది పార్టీ నాయకలు అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థిపై 61వేల ఆధిక్యంతో గెలుపొందారు. 

05:19 PM (IST) Mar 10

లక్ష ఓట్ల మెజారిటీతో సీఎం యోగి ఘనవిజయం

గోరఖ్ పూర్ అర్భన్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బంపర్ మేజారిటీ సాధించారు. ఆయన లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 
 

05:10 PM (IST) Mar 10

తెలంగాణలోనూ అమిత్ షా బుల్డోజర్ వుంచారు...: రాజాసింగ్ సంచలనం

నాలుగు రాష్ట్రాల్లో బిజెపి సాధించిన విజయం జనతా విజయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తెలంగాణలోనూ బండి సంజయ్ రూపంలో బుల్డోజర్ వుంచారు హోంమంత్రి అమిత్ షా అంటూ బిజెసిఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

05:02 PM (IST) Mar 10

ఈ ఓటమిని స్వీకరిస్తేన్నాం..: రాహుల్ గాంధీ

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు.  ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో  గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌, కార్యకర్తలు, వాలంటీర్ల కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని.. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

 

04:54 PM (IST) Mar 10

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దూ ఓటమి

 పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనానికి హేమాహేమీ నాయకులు సైతం ఓటమిని చవిచూసారు. వీరిలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా వున్నారు. అమృత్ సర్ ఈస్ట్ నుండి పోటీచేసిన సిద్దూ ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో పరాజయం పొందారు. 
 

04:43 PM (IST) Mar 10

మణిపూర్ లో బిజేపిదే మేజిక్ ఫిగర్

మణిపూర్ లో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మొత్తం 60స్థానాలున్న ఈ రాష్ట్రంలో బిజెపి  32 గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ సాధించింది. ఇక్కడ ఎన్పిపి 8, కాంగ్రెస్ 5, ఇతరులు 15స్థానాలు గెలుచుకున్నారు. ఇతరుల మద్దతు లేకుండానే బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునేలా సీట్లు వచ్చాయి. 


 

04:39 PM (IST) Mar 10

ఉత్తరాఖండ్ లో బిజెపి ఘన విజయం

ఉత్తరాఖండ్ లో బిజెపి పార్టీ మరోసారి సత్తాచాటింది. రాష్ట్రంలోని 70 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా బిజెపి 48 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యింది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం 18సీట్లకే పరిమితమయ్యింది. ఇతరులు 4చోట్ల గెలుపొందారు. 
 

04:35 PM (IST) Mar 10

గోవా మాజీ సీఎం పర్సేకర్ ఓటమి

గోవాలో బిజెపి పార్టీ 20స్థానాలలో అతిపెద్ద పార్టీగా అవతరించినా మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమిని చవిచూసారు. 

04:10 PM (IST) Mar 10

గోవాలో మేజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో నిలిచిన బీజేపీ

గోవాలో పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. 40 స్థానాలులున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 20 స్థానాలు గెలిచింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (21)కి ఒక్క సీటు మాత్రం బీజేపీకి తగ్గింది. కాంగ్రెస్ 12, టీఎంసీ 2, ఆప్ 2 చోట్ల విజయం సాధించాయి. 

03:38 PM (IST) Mar 10

పంజాబ్‌: మేజిక్ ఫిగర్‌ను దాటేసిన ఆమ్ ఆద్మీ పార్టీ

పంజాబ్‌లో అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ (59) సాధించింది. అలాగే మరిన్ని స్థానాల్లో ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు సామాన్యుడి పార్టీ 70 స్థానాల్లో గెలిచింది. 

02:59 PM (IST) Mar 10

పంజాబ్: రాజ్‌భవన్‌లో కాదు.. పూర్వీకుల స్వగ్రామంలో ప్రమాణ స్వీకారం

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో కాకుండా తన పూర్వీకుల గ్రామంలో ప్రమాణ స్వీకారం చేస్తానని భగవంత్ మాన్ తెలిపారు. 

02:34 PM (IST) Mar 10

సోనూసూద్ సోదరి మాళవిక ఓటమి

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు చిత్తవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చన్నీ సహా పలువురు ప్రముఖులు ఓటమి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే సినీనటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ మోగ స్థానంలో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గం గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా వుంది

02:25 PM (IST) Mar 10

ప్రజల తీర్పును స్వీకరిస్తున్నా : కెప్టెన్ అమరీందర్ సింగ్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

01:45 PM (IST) Mar 10

మణిపూర్ లో అతిపెద్ద పార్టీగా బిజెపి...

మణిపూర్ లో బిజెపి అధికారానికి చేరువలో నిలిచింది. మ్యాజిక్ ఫిగర్ ను  చేరుకోకున్నా ఈ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్పిపి 10, ఇతరులు 14 చోట్ల గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడా అతితక్కువగా 7సీట్లతోనే సరిపెట్టుకుంది. 


 

01:15 PM (IST) Mar 10

యూపీలో యోగి రికార్డ్... ఓడినా సమాజ్ వాది పార్టీ అరుదైన ఘనత

ఉత్తర ప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండోసారి కూడా బిజెపిని యూపీ ప్రజలు గెలిపించడంతో ముఖ్యమంత్రిగా యోగి కొనసాగనున్నారు. ఇదే జరిగితే దశాబ్దాల తర్వాత వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఘనత ఆయన ఖాతాలోకి వెళుతుంది. అయితే ప్రతిపక్షానికే పరిమితమైనా సమాజ్ వాది పార్టీ కూడా అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. యూపీలో ప్రతిపక్ష పార్టీకి వందకు పైగా సీట్లు రావడం చాలాకాలం తర్వాత కనిపిస్తోంది.  
 

01:09 PM (IST) Mar 10

పోటీచేసిన రెండు చోట్లా పంజాబ్ సీఎం చన్ని ఓటమి

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ పోటీచేసిన రెండుచోట్ల ఓటమిపాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు సీనియర్ రాజకీయ నాయకులు కూడా నిలవలేకపోయారు. 

12:59 PM (IST) Mar 10

గోవా బిజెపిదే... ఇండిపెండెంట్లతో కలిపి ప్రభుత్వ ఏర్పాటు: సీఎం ప్రమోద్

గోవాలో అత్యధిక సీట్లు సాధించినప్పటికి బిజెపి పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిదూరంలో నిలిచింది. అయితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కలుపకుపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని సీఎం గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఇవాళ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ శ్రీధరన్ పిళ్లై ను కలవనున్నట్లు బిజెపి ప్రకటించింది. 

 

12:46 PM (IST) Mar 10

గోవాలో క్యాంప్ రాజకీయాలు

గోవాలో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను చేరే అవకాశాలు లేకపోవడంతో క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కు తరలించింది. 

12:21 PM (IST) Mar 10

పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి

పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమిపాలయ్యారు. పటియాలా నియోజకవర్గం నుండి పోటీచేసిన ఆయన ప్రత్యర్థి చేతిలో ఓటమిని చవిచూసారు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో హేమాహేమీలు ఓటమిపాలవుతున్నారు. 
 

12:11 PM (IST) Mar 10

పంజాబ్ కాంగ్రెస్ లో పలితాల ప్రకంపనలు... పిసిపి చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా?

పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామాకు సిద్దమయ్యారు. మరికొద్దిసేపట్లో ఆయన రాజీనామా ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

12:07 PM (IST) Mar 10

ఉత్తరాఖండ్ లో మళ్లీ బిజెపిదే అధికారం

ఉత్తరాఖండ్ లో బిజెపి పార్టీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి.  మొత్తం 70సీట్లకు గాను బిజెపి  45 చోట్ల ఆధిక్యంతో స్పష్టమైన మెజారిటీ సాధించేలా కనిపిస్తోంది. ఇక  కాంగ్రెస్ పార్టీ కేవలం 21సీట్లలో ఆధిక్యానికే పరిమితమయ్యింది.  

11:54 AM (IST) Mar 10

ఇప్పటికే 35వేల ఓట్ల ఆధిక్యం... భారీ విజయం దిశగా యోగి ఆదిత్యనాథ్

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. గోరఖ్ పూర్ అర్భన్ నియోజకవర్గం నుండి ఫోటీచేసిన ఆయన 10వ రౌండ్ ఔట్ల లెక్కింపు పూర్తయ్యేసరికే 35వేల ఓట్ల ఆదిక్యంలో  కొనసాగుతున్నారు. 
 

11:42 AM (IST) Mar 10

హంగ్ దిశగా గోవా...

గోవాలో బిజెపి పార్టీ 19 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నా మ్యాజిక్ ఫిగర్ ను మాత్రం దాటలేదు. ఇక్కడ కాంగ్రెస్ కేవలం 10సీట్లకు మాత్రమే పరిమితమయ్యింది. తృణమూల్ కాంగ్రెస్ 4, ఇతరులు 7చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే టీఎంసీ, ఇతర సభ్యులు కీలకం కానున్నారు.

11:25 AM (IST) Mar 10

యూపీలో ఖాతా తెరవని ఎంఐఎం

ఉత్తర ప్రదేశ్ లో ఎంఐఎం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. వందకుపైగా సీట్లలో అభ్యర్థులకు బరిలోకి దింపిన ఎంఐఎం ఖాతా కూడా తెరవలేదు. 

11:19 AM (IST) Mar 10

యూపీలో బిజెపికి 42, ఎస్పీకి 31 శాతం ఓట్ షేర్

ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల ప్రకారం బిజెపి భారీగా సీట్లనే కాదు ఓట్లను కూడా సాధించింది. ఇక్కడ బిజెపి 42.3% ఓట్ షేర్ సాధించి అతిపెద్ద పార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి రెండో సారి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఇక సమాజ్ వాది పార్టీ 31.6% ఓట్ షేర్ తో రెండో స్థానంలో నిలిచింది. 

10:37 AM (IST) Mar 10

యూపీలో బిజెపి హవా... 300 స్థానాల్లో ఆధిక్యం

యూపీలో బిజెపి పార్టీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కు సరిపడా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే బిజెపి ఆధిక్యం 300 దాటడంతో  ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 
 

10:26 AM (IST) Mar 10

ఉత్తరా ఖండ్ లో మాజీ సీఎం హరీష్ రావత్ వెనుకంజ

ఉత్తరా ఖండ్ లో మాజీ సీఎం హరీష్ రావత్ వెనుకంజలో వున్నారు. 

10:24 AM (IST) Mar 10

పంజాబ్ లో ఆప్ దాటికి హేమాహేమీలు విలవిల

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ దాటికి హేమాహేమీలు సైతం నిలవలేకపోతున్నారు. ప్రస్తుత సీఎం చన్నీతో పాటు పిసిసి చీఫ్ సిద్దూ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెనుకంజలో వున్నారు.


 

09:46 AM (IST) Mar 10

పంజాబ్ లో ఆప్ అద్భుత ప్రదర్శన.... 90 చోట్ల ముందంజ

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ  పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఆప్ 90సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లకే పరిమితమయ్యింది. 


 

09:23 AM (IST) Mar 10

అఖిలేష్ ముందంజ

కర్హల్ నియోజకవర్గంలో ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ ముందంజలో వున్నారు. 

09:19 AM (IST) Mar 10

ఉత్తరప్రదేశ్ లో బిజెపి, పంజాబ్ లో ఆప్, గోవాలో కాంగ్రెస్ ఆధిక్యం

ఉత్తరప్రదేశ్ లో బిజెపి దూసుకుపోతోంది. పంజాబ్ లో ఆప్, మణిపూర్ లో బిజెపి,ఉత్తరాఖండ్ లో  బిజెపి,  గోవాలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

09:05 AM (IST) Mar 10

పంజాబ్ లో మాజీ సీఎం అమరీందర్ వెనుకంజ

పటియాలాలో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వెనుకంజలో వున్నారు. 

08:47 AM (IST) Mar 10

గోవా సీఎం అభ్యర్థి ప్రమోద్ ముందంజ

సాంక్వేలిన్ లో గోవా సీఎం అభ్యర్ధి ప్రమోద్ సావంత్ ముందంజలో వున్నారు. 

08:39 AM (IST) Mar 10

ఉత్తరాఖండ్ సీఎం వెనుకంజ

ఉత్తరాఖండ్ సీఎం  పుష్కర్ ధామీ పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపులో వెనుకంజలో వున్నారు.