ఛండీఘడ్-కోచ్ వల్లి రైలులో అగ్ని ప్రమాదం

Published : Sep 06, 2019, 03:33 PM ISTUpdated : Sep 06, 2019, 03:36 PM IST
ఛండీఘడ్-కోచ్ వల్లి రైలులో అగ్ని ప్రమాదం

సారాంశం

న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో అగ్ని ప్రమాదం సంబవించింది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లింది.

న్యూఢిల్లీ:న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఛండీఘడ్-కోచ్ వల్లి రైలులో శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. రైల్వేస్టేషన్ లో రైలు నిలిచి ఉన్న సమయంలో  ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ సమయంలో రైలులో ఉన్న ప్రయాణీకులను అధికారులు కిందకు దించేశారు.

ఛంఢీఘడ్ కోచ్‌వల్లి ఎక్స్‌ప్రెస్ రైలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 8వ ఫ్లాట్‌ఫారంలో నిలిచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలుకు విద్యుత్ ను సరఫరా చేసే బోగి నుండి ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. 

ఈ  బోగీ నుండి ఇతర బోగీలకు కూడ మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే ఫైరింజన్లను రప్పించి మంటలను ఆర్పతున్నారు.ఈ అగ్ని ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ రైళ్ల రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?