బెంగుళూరు కోరమంగళ భవనంలో అగ్ని ప్రమాదం: భవనం నుండి దూకిన వ్యక్తి

Published : Oct 18, 2023, 03:22 PM ISTUpdated : Oct 18, 2023, 03:48 PM IST
బెంగుళూరు కోరమంగళ భవనంలో అగ్ని ప్రమాదం: భవనం నుండి దూకిన వ్యక్తి

సారాంశం

బెంగుళూరులోని కోరమంగళ ప్రాంతంలో  ఇవాళ  భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.అగ్ని ప్రమాదం నుండి తప్పించుకొనేందుకు గాను ఓ వ్యక్తి  భవనం పై నుండి కిందకు దూకాడు.


బెంగుళూరు:నగరంలోని  కోరమంగళ  ప్రాంతంలోని తావరెకెరె మెయిన్ రోడ్డులో ఓ భవనంలో నాలుగో అంతస్థు కేఫ్ లో బుధవారంనాడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ భవనంలో మంటలను నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి.

ఇవాళ ఉదయం 11:30 గంటలకు  ఈ భవనంలో  అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్థు నుండి ఇతర అంతస్థులకు  మంటలు వ్యాపించాయి. ఈ భవనంలో చిక్కుకున్నవారిని  ఫైరింజన్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. మంటల నుండి తప్పించుకొనేందుకు  ఓ వ్యక్తి భవనం పై నుండి కిందకు దూకాడు.భవనం కింది అంతస్తులో  పార్క్ చేసిన  రెండు బైక్ లు, భవనం సమీపంలోని  షోరూమ్ లో ఓ కారు దెబ్బతిందని  అధికారులు తెలిపారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ప్రతి రోజూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  నందిగామలో గల ఫర్నీచర్  దుకాణంలో  ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదంలో ఫర్నీచర్ కాలిబూడిదైంది.

ఈ నెల 14న  తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పరిధిలోని  ఐడీఏ బొల్లారంలో  ఓ ప్రైవేట్ ఫార్మాసూటికల్ ఫ్యాక్టరీలో  రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయి.  ఈ ఘటనలో  15 మంది  కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.మూడు ఫైరింజన్లు  మంటలను ఆర్పివేశాయి.పంజాబ్ లోని  ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో ఈ నెల  11న  అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో  ఆసుపత్రిలో ఉన్న  424 మంది రోగులను  సురక్షితంగా  తరలించారు.

PREV
click me!

Recommended Stories

AI అతిగా వాడుతున్నారా? జ్ఞాపకశక్తి మటాష్.. మీ మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?
Mukesh Ambani: ముఖేష్ అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్.. బాంబు దాడి చేసినా చెక్కుచెదిరే అవకాశమే లేదు