కరోనా పాటకు కూచిపూడి డ్యాన్స్ కంపోజ్..దానికే బలైన శోభానాయుడు..

By AN TeluguFirst Published Oct 14, 2020, 9:30 AM IST
Highlights

ప్రముఖ కూచిపూడీ నృత్యకారిణి శోభానాయుడు కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు. గత ఏప్రిల్ లోనే ధరా తలానికి ముళ్ల కిరీటం కరోనా అంటూ కరోనా మీద రాసిన పాటకు కూచిపూడి డ్యాన్స్ కంపోజ్ చేశారు. క్రూర కరోనా, ఘోర కరోనా.. నిన్ను సంహరించి విజయభేరి మోగిస్తా.. ఇక నమస్కరించి జైత్రయాత్ర సాగిస్తా అంటూ అభినయం చేసిన శోభానాయుడు ఆ కరోనాకే బలి అయ్యారు. 

వెనిగళ్ల రాంబాబు రాసిన కరోనా పాటకు, సంగీత దర్శకుడు కోటి సంగీతం అందించగా ఈ పాటను హరిని ఇవటూరి పాడారు. 58 యేళ్ల శోభానాయుడు వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. కూచిపూడి నృత్యంలో పద్మశ్రీ కూడా అందుకున్నారు. 

కొన్ని రోజుల కిందట ఇంట్లో జారిపడటంతో తలకు బలమైన గాయమైంది. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ క్రమంలో ఆమె కరోనా బారిన పడినట్లు తెలిసింది. 

పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున శోభానాయుడు తుదిశ్వాస విడిచారని సమాచారం. అనేకమంది ప్రముఖులుప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ శోభానాయుడు మృతి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

click me!