Exit polls 2019: మహారాష్ట్ర, హర్యానాల్లో వార్ వన్‌సైడ్

By narsimha lodeFirst Published Oct 21, 2019, 7:16 PM IST
Highlights

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీకే ఓటర్లు పట్టం కట్టనున్నారని మెజారిటీ సర్వే సంస్థలు తేల్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీకి సోమవారం నాడు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని పలు సర్వే సంస్థలు ప్రకటించాయి. 

న్యూఢిల్లీ:  మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీకే ఓటర్లు పట్టం కట్టనున్నారని మెజారిటీ సర్వే సంస్థలు తేల్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీకి సోమవారం నాడు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని పలు సర్వే సంస్థలు ప్రకటించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మరోసారి బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకొనే అవకాశం ఉందని  ఎగ్జిల్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.

మహారాష్ట్రలో పలు సర్వే సంస్థల ఫలితాలు

     

Read more #Exit polls రిపబ్లిక్ టీవీ-జన్‌కీ బాత్ సర్వే : మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిదే హవా...

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. 

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది. 

హర్యానాలో కమలం హవా

 

హర్యానాలో కూడ బీజేపీదే హవా కొనసాగే అవకాశం ఉందని మెజారిటీ సర్వే సంస్థలు ప్రకటించాయి.

రాష్ట్రంలో పార్టీ నేతృత్వం మారిన తరువాత హర్యానాలో కాంగ్రెస్ ఎలాగైనా తన పూర్వ వైభవాన్ని సాధించి తీరుతామని నమ్మకంగా ఉన్నారు. మరోవైపేమో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి తీరుతామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఉన్న 90 సీట్లలో ఎలాగైనా 75 సీట్లు గెలవాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఉన్న 90 సీట్లలో బీజేపీకి 48 సీట్లున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న 10 స్థానాలకు 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 

దుశ్యంత్ చౌతాలా నాయకత్వంలోని జన నాయక్ జనతా పార్టీ కూడా తన భవితవ్యాన్ని మార్చుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నం చేస్తుంది. చౌతాలా కుటుంబంలో వచ్చిన మనస్పర్థల వల్ల దుశ్యంత్ చౌతాలా గత డిసెంబర్ లో ఐఎన్ ఎల్డి నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెల్;ఇసిందే. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా విఫలమయ్యింది. 

బీఎస్పీ, ఆప్,ఎల్ఎస్పీ, సహా చాల పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాకపోతే వీరెవరూ అన్ని సీట్లలోనూ పోటీ చేయడం లేదు. బీజేపీ ఈ సరి ముగ్గురు క్రీడాకారులకు హర్యానాలో టిక్కెట్లు ఇచ్చింది. బబిత ఫోగట్, యోగేశ్వర్ దత్, సందీప్ సింగ్. సందీప్ సింగ్ హాకీ క్రీడాకారుడు కాగా, మిగిలిన ఇద్దరు కుస్తీ యోధులు. 

2014లో బీజేపీ తొలిసారిగా హర్యానాలో అధికారం చేపట్టింది. 47 సీట్లలో గెలవడం ద్వారా బీజేపీ అధికారం చేజిక్కించుకోగలిగింది. ఈ సంవత్సరామారంభంలో జరిగిన జింద్ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా తన కౌంట్ ను 48కి తీసుకెళ్లింది. ఐఎన్ఎల్డి  కి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ కు 17మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలకు చెరో ఎమ్మెల్యే ఉన్నారు. ఇంకో 5గురు స్వతంత్రులు 2014లో విజయం సాధించారు. 


హార్యానా
 

బీజేపీ                                                66                                                52-63           75                                                                              75 -80             71

కాంగ్రెస్                                             14                                               15-19             10                                                                               9-12               11

జేజేపీ                                                                                                    5-9                 02
 
ఐన్‌ఎల్‌డీ                                          2                                                 0-1

ఇతరులు                                          8                                                  7-9                 03                                                                               1-3                 06

  
     

click me!