మోదీని కాదని మాజీ ప్రధానికి పాక్ ఆహ్వానం: తిరస్కరించిన మన్మోహన్ సింగ్

By Nagaraju penumalaFirst Published Sep 30, 2019, 6:31 PM IST
Highlights

నవంబర్ 9న జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఆహ్వానించారు. ఖురేషీ ఆహ్వానించిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు షాక్ ఇచ్చారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం పాకిస్తాన్ పంపనున్న ఆహ్వానాన్ని ముందే తిరస్కరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. 

నవంబర్ 9న జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఆహ్వానించారు. ఖురేషీ ఆహ్వానించిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని తాము నిర్ణయించాం. సిక్కులకు ప్రతినిధిగా ఆయన గౌరవనీయ స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తరపున ఆయనకు నేను ఆహ్వానం తెలుపుతున్నాను. ఆయనకు రాతపూర్వకంగా కూడా ఆహ్వానం పంపిస్తాం అని పాక్ విదేశాంగ మంత్రి ఖరేషీ వీడియో సందేశం పింపిన సంగతి తెలిసిందే. 

2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా పనిచేసిన తొలి సిక్కు వ్యక్తిగా మన్మోహన్ సింగ్‌ రికార్డు సృష్టించారని ప్రశంసించారు ఖురేషీ. కర్తార్‌‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 

గురు నానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా భారత సిక్కు యాత్రికుల కోసం కర్తార్ పూర్ ర్ కారిడార్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కర్తార్‌‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ నుంచి పంజాబ్‌లోని గురుదాస్‌‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ ఆశ్రమం వరకు ఈ కారిడార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. భారత సిక్కు యాత్రకులకు వీసా లేకుండా దర్శనానికి వెళ్లే అవకాశం లభించనుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

పాక్‌ అక్కసు: కర్తార్‌పూర్ ప్రారంభానికి మోడీకి బదులు మన్మోహన్‌కు ఆహ్వానం

click me!