ఫోర్జరీ కేసులో మాజీ సీఎం తనయుడు అరెస్ట్

By narsimha lodeFirst Published Sep 3, 2019, 2:31 PM IST
Highlights

ఫోర్జరీ కేసులో మాజీ సీఎం అజిత్ జోగి తనయుడు అమిత్ జోగిని అరెస్ట్ చేశారు. 


న్యూఢిల్లీ: ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి తనయుడు అమిత్ జోగిని మంగళవారం నాడు చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

బిలాస్‌పూర్‌లోని తన నివాసంలో అమిత్ జోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.బీజేపీ నేత సమీరా పైక్రా ఫిర్యాదు మేరకు పోలీసులు అమిత్ జోగిని అరెస్ట్ చేశారు. 2013లో మార్వాతి నియోజకవర్గం నుండి సమీరా పైక్రా పోటీ చేసి ఓటమి  పాలయ్యాడు.

పైక్రా అమిత్ జోగిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో పైక్రా పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసింది.అమిత్ జోగి తప్పుడు పుట్టిన తేదీ, పుట్టిన స్థలాన్ని తప్పుడుగా అఫిడవిట్ లో పేర్కొన్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సర్బేరా గౌరేలా గ్రామంలో 1978లో పుట్టినట్టు క్లైయిమ్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.

1977లో అమెరికాలోని టెక్సాస్ లో అమిత్ జోగి  పుట్టాడని ఆమె చెప్పారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను ఆయనను అరెస్ట్ చేశారు. అమిత్ జోగిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. 
 

click me!