ఢిల్లీ లిక్కర్ స్కాం: సప్లిమెంటరీ చార్జీషీట్‌లో మాగుంట రాఘవ సహా ముగ్గురి పేర్లు

Published : Apr 06, 2023, 03:06 PM ISTUpdated : Apr 06, 2023, 03:14 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం: సప్లిమెంటరీ చార్జీషీట్‌లో మాగుంట రాఘవ సహా  ముగ్గురి  పేర్లు

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ  ఇవాళ  సప్లిమెంటరీ చార్జీషీట్ ను  దాఖలు  చేసింది. ఈ చార్జీషీట్ లో  ముగ్గురిపై  అభియోగాలు  మోపింది. 

న్యూఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సప్లిమెంటరీ చార్జీషీట్ ను  గురువారంనాడు ఈడీ  దాఖలు చేసింది. ముగ్గురు నిందితుపై  అభియోగాలు నమోదు  చేసింది  ఈడీ,  మాగుంట  రాఘవ , రాజేష్  జోషి, గౌతమ్ మల్హోత్రా పై  అభియోగాలు మోపింది  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ . ఈ ఏడాది ఫిబ్రవరి  మాసంలో   అరెస్ట్ చేసిన  నిందితుల  విచారణకు  సంబంధించిన  అంశాలను  ఈ చార్జీషీట్ లో  ఈడీ ప్రస్తావించింది.  

ఢిల్లీ లిక్కర్ స్కాంపై  గత ఏడాది నవంబర్  26న  తొలి చార్జీషీట్ ను  ఈడీ  కోర్టుకు  సమర్పించింది.  ఈ ఏడాది  ఫిబ్రవరి మాసంలో  ఈడీ  రెండో చార్జీషీట్ ను దాఖలు  చేసింది . రెండో చార్జీషీట్ లో మనీష్ సిసోడియా,  అరవింద్ కేజ్రీవాల్,  కవిత పేర్లను ఈడీ  చేర్చింది. తాజాగా సప్లిమెంటరీ  చార్జీషీట్ ను దాఖలు  చేసింది. ఈ సప్లిమెంటరీ చార్జీషీట్ లో  ముగ్గురి పేర్లను   ఈడీ పేర్కొంది.  అయితే ఈ  చార్జీషీట్ ను  ఈ నెల  14న స్వీకరించనున్నట్టుగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ  కోర్టు   తెలిపింది

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations