Election Results 2019:పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ముందంజ

By narsimha lodeFirst Published Oct 24, 2019, 8:29 AM IST
Highlights

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోస్లల్ బ్యాలెట్ ఓట్ల లె్కింపులో బీజేపీ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. ఈవీఎంల లెక్కింపులో కూడ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో  పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

గురువారం నాడు ఉదయం ఏడుగంటలకే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.  ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే  తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో  బీజేపీ అభ్యర్థులు తమ సమీప కాంగ్రెస్ అభ్యర్ధుల కంటే ముందంజలో దూసుకుపోతున్నారు. పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే మహారాష్ట్రలోని 48 స్థానాల్లో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి 15, ఒక్క స్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నారు. హర్యానాలో 11 స్థానాల్లో బీజేపీ, ఏడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

అక్టోబర్ 21న జరిగిన పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ మొదలయ్యింది. హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో 64 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 64 స్థానాల్లో తెలంగాణ లోని హుజూర్ నగర్ స్థానం కూడా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికవడంతో ఈ సీట్ ఖాళీ అయ్యిన సంగతి తెలిసిందే. 

మహారాష్ట్ర, హర్యానాల్లో వోటింగ్ శాతం గతంతో పోలిస్తే తగ్గింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో 63 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అంతకన్నా తక్కువగా కేవలం 60శాతం మాత్రమే నమోదయింది. హర్యానాలో గత దఫా 77 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సరి అది దాదాపుగా 12శాతం తగ్గి 65 శాతం నమోదయ్యింది. 

Also Read:#HuzurNagar Result: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు...

హుజూర్ నగర్లో మాత్రం గత దఫా కన్నా పోలింగ్ శాతం అధికంగా నమోదవ్వడం విశేషం. ఈ పెరిగిన శాతం తమకంటే తమకు లాభం కలిగిస్తుందని ఇటు తెరాస, కాంగ్రెస్ లు తెగ వాదులాడుకుంటున్నాయి. ఇటు అధికార తెరాస, సిట్టింగ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠంగా మారింది. ఒక రెఫరెండం మాదిరిగా ఈ ఎన్నికను అందరూ భావించడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేశారు. 

ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే హర్యానా,మహారాష్ట్రలో కమలం పార్టీ పూర్తి హవా ప్రదర్శిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెబుతున్నాయి. హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ లు మరోమారు ముఖ్యమంత్రి పీఠాలు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఇకపోతే హుజూర్ నగర్ విషయానికి వస్తే, ఆరా,మిషన్ చాణక్యులు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి. ఈ రెండు సంస్థలు కూడా తెరాస ఈ సీటును గెలుచుకోవడం తథ్యమని చెప్పాయి. 

 

click me!