రాజీకొచ్చిన పన్నీరు సెల్వం : సీఎం అభ్యర్ధి పళనిస్వామి, తేల్చేసిన ఎఐఏడీఎంకె

By narsimha lodeFirst Published Oct 7, 2020, 10:15 AM IST
Highlights

ఎఐఏడీఎంకెలో  సీఎం అభ్యర్ధి పదవిపై నెలకొన్న వివాదం తొలగిపోయింది.  పార్టీలోని పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సీఎం అభ్యర్ధి ఎంపిక విషయంలో రాజీ కుదిరింది. 

చెన్నై: ఎఐఏడీఎంకెలో  సీఎం అభ్యర్ధి పదవిపై నెలకొన్న వివాదం తొలగిపోయింది.  పార్టీలోని పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సీఎం అభ్యర్ధి ఎంపిక విషయంలో రాజీ కుదిరింది. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఎఐఏడీఎంకె తన సీఎం అభ్యర్ధిగా పళని స్వామిని ప్రకటించింది. పళనిస్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం స్వయంగా ప్రకటించారు.


వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎఐఏడీఎంకె నుండి సీఎం అభ్యర్ధి ఎవరనే విషయమై తీవ్ర చర్చ సాగుతోంది. పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. మంత్రులు కూడ ఇద్దరికి మద్దతుగా ఉన్నారు.

గత మాసంలో జరిగిన ఎఐఏడీఎంకె  సమావేశం సీఎం అభ్యర్ధి ఎంపిక విషయమై పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య తీవ్ర పోటా పోటీ వాతావరణం చోటు చేసుకొంది.ఎఐఏడీఎంకె పార్టీ కీలక సమావేశం బుధవారం నాడు పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయాలను పన్నీరు సెల్వం మీడియాకు వివరించారు.

వచ్చే ఎన్నికల్లో ఎఐఏడీఎంకె నుండి సీఎం అభ్యర్ధిగా పళని స్వామిగా పార్టీ నిర్ణయం తీసుకొందని  డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం స్వయంగా ప్రకటించారు.అన్నాడీఎంకె స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 11 మందిని సభ్యులుగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్ గా పన్నీరు సెల్వం ఉంటారు. పార్టీ చీఫ్ గా ఎవరు ఉండాలనే విషయాన్ని ఈ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

ఈ స్టీరింగ్ కమిటీలో దిండిగల్ సీఎస్, శ్రీనివాసన్, పి. తంగమణి, ఎస్పీ, వేలుమణి, డి.జయకుమార్, సి.షణ్ముగం, ఆర్, కామరాజ్, జేసీడీ, ప్రభాకర్, పీ,హెచ్. మనోజ్ పాండియన్, పి. మోహన్, ఆర్, గోపాలకృష్ణన్, సి.మణికాం సభ్యులుగా ఉన్నారు.

మంగళవారం నాడు సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలతో పార్టీ నేతలు సుధీర్ఘంగా చర్చించారు. పి.తంగమణి, ఎస్పీ. వేలుమణి, డి.జయకుమార్, షణ్ముగం, ఉదయ్ కుమార్ లు వీరిద్దరితో చర్చించారు. కేపీ మునుస్వామి, ఆర్. వైతలింగం లు బుధవారం నాడు తెల్లవారుజాము మూడు గంటల వరకు పన్నీరు సెల్వంతో చర్చించారు.

click me!