
ముంబై: మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి Anil Parab ఇల్లు, కార్యాలయాలపై Encorcement Directorate అధికారులు గురువారం నాడు సోదాలు నిర్వహించారు. రత్నగిరి తీర ప్రాంత దాపోలిలో జరిగిన భూ ఒప్పందంలో అవకతవకలకు పాల్పడినట్టుగా మంత్రి అనిల్ పరాబ్ ఇతరులపై ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ విచారణలో Shiv Sena నేత రవాణా శాఖ మంత్రి అనిల్ పరాబ్ ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది.
money launderingనిరోధక చట్టం లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఫెడరల్ ఏజెన్సీ తాజా కేసు నమోదు చేసిన తర్వాత డాపోలీ, ముంబై, పూణెల్లో సోదాలు చేస్తున్నారు. శివసేన నుండి అనిల్ పరాబ్ మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో అనిల్ రవాణా శాఖ మంత్రి గా కొనసాగుతున్నారు.
2017లో అనిల్ పరాబ్ దపోలి వద్ద భూమి కొనుగోలులో అవకతవకలకు పాల్పడినట్టుగా వచ్చిన ఆరోపణలపై 2019లో ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో పాటు మరికొన్ని ఆరోపణలపై కూడా ఈడీ విచారణ చేస్తుంది. ఈ భూమిని ముంబైకి చెందిన కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్ కి 2020లో రూ.1.10 కోట్లకు విక్రయించినట్టుగా ఆరోపణలున్నాయి 2017 నుండి 20220 లో ఈ భూమిలోనే రిసార్ట్ ను నిర్మించారు. రిసార్ట్ నిర్మాణం కోసం రూ. 6 కోట్లు ఖర్చు చేశారని ఐటీ శాఖ విచారణలో తేలింది.
గతంలో కూడా మాజీ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తో ఉన్న మనీలాండరింగ్ కేసులో కూడా అనిల్ పరాబ్ ను ఈడీ ప్రశ్నించింది.