
ముంబై: అండర్ వరల్డ్ డాన్ Dawood Ibrahimతో సంబంధం ఉందనే ఆరోపణలతో NCP నేత, మహారాష్ట్ర మంత్రి Nawab Malik ను బుధవారం నాడు Enforcement Directorate అధికారులు అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో నవాబ్ మాలిక్ ను ఈడీ అధికారులు అంతకు ముందు ఆయనను తీసుకెళ్లి విచారించారు.
నవాబ్ మాలిక్ ఎన్సీపీ చీఫ్ Sharad Pawar కు అత్యంత సన్నిహితుడు. ఏడు గంటల పాటు నవాబ్ మాలిక్ ను ఈడీ అధికారులు విచారించారు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఈడీ అధికారులు ప్రకటించారు.ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించిన తర్వాత తాను తలవంచనని నవాబ్ మాలిక్ తేల్చి చెప్పారు. దావూద్ ఇబ్రహీంతో పాటు అతని సహాయకులతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసు కు సంబంధించి నవాబ్ మాలిక్ ను ఈడీ అధికారులు ఇవాళ విచారించారు.
ఈ విషయమై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ఎప్పుడూ కూడా కేంద్రం ముందు తలవంచలేదన్నారు. రాష్ట్రంలోని అధికార శిబిరం కేంద్ర సంస్థల చర్యలతో ఆశ్చర్యపోలేదన్నారు. తన రాజకీయ ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని ఆమె ఆరోపించారు. ఇది దురదృష్టకరమని చెప్పారు.
దావూద్ ఇబ్రహీంతో పాటు అతని సోదరుడు అనీస్ ఇక్బాల్, సహాయకుడు చోటా షకీల్ ఇతరులపై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నవాబ్ మాలిక్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గత వారంలో ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఈ విషయమై సోదాలు నిర్వహిం,చారు.