మోదీ ఫోటోలను తొలగించండి.. ఈసీ ఆదేశం

Published : Mar 04, 2021, 09:50 AM ISTUpdated : Mar 04, 2021, 09:59 AM IST
మోదీ ఫోటోలను తొలగించండి.. ఈసీ ఆదేశం

సారాంశం

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపుల్లో ప్రధాని నరేంద్రమోదీ చిత్రాలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. 

భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోటోలను తొలగించాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపుల్లో ప్రధాని నరేంద్రమోదీ చిత్రాలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాలతో కేంద్రప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ పెట్రోల్ పంపుల్లో హోర్డింగులు పెట్టడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా ఈసీ పేర్కొంది. 

పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలకు గత శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటోలు, పోస్టర్లు, వీడియోలను వినియోగిస్తున్నారని, దీనిపై ఆదేశాలు జారీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పెట్రోల్ పంపులతోపాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రచారంలో ప్రధాని మోదీ చిత్రాలు, పోస్టర్లు, వీడియోలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood