
చెన్నై: తమిళనాడు(Tamlinadu)లో పట్టణ పురపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే(DMK) పార్టీ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లోనూ పరాజయం పాలైన ఏఐఏడీఎంకే(AIADMK) కోయంబత్తూర్(Coimbatore) రీజియన్‌లోని అన్ని సీట్లను గెలుచుకుంది. ఏఐఏడీఎంకేకు కోయంబత్తూర్ రీజియన్ పెట్టని కోట వంటిదని పేరు ఉన్నది. కానీ, ఆ ఏఐఏడీఎంకే కోటను సైతం డీఎంకే అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో బద్దలు కొట్టింది. తమిళనాడులో పదేళ్ల తర్వాత మళ్లీ స్థానిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏడీఎంకే విజయదుుందుభి మోగించింది. ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలోని 21 కార్పొరేషన్లలోని 12601 వార్డులు, 138 మున్సిపాలిటీలు, 489 పట్టణ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ తమిళనాడులో ఏఐఏడీఎంకే ఘన విజయాన్ని నమోదు చేసింది. కానీ, ఈ స్థానిక ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ పశ్చిమ తమిళనాడులోని 75 శాతం సీట్లను గెలుచుకుంది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కోయబంత్తూర్ రీజియన్‌లోని పది సీట్లను ఏఐఏడీఎంకే గెలుచుకుంది. ఇప్పుడు ఈ రీజియన్‌లోని స్థానిక ఎన్నికల్లో డీఎంకే అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాసానికి ప్రతీకలు అని డీఎంకే పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి పశ్చిమ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తమ పార్టీ ఫోకస్ పెట్టిందని డీఎంకే తెలిపింది.
ఇదిలా ఉండగా, తమిళ నాట రజనీ తర్వాత అంతటి స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్. పొలిటికల్ ఎంట్రీ గురించి సరైనా క్లారిటీ ఇవ్వకున్నా.. విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఓ సేవా సంఘం నడిపిస్తున్నారు. గతేడాది జరిగిన తమిళనాడు పంచాయతీ ఎన్నిక(రూరల్ బాడీ)ల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో 170 స్థానాల్లో తన అభిమానులు పోటీ చేస్తే 129 మంది విజయం సాధించారు. ఈ ఉత్సాహంతో విజయ్ అభిమానులు మరోసారి తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల 2022లో పోటీ చేయడానికి తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం అనే పేరును ఉపయోగించారు.
తమిళనాట దశాబ్దం తర్వాత ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం తరపున పోటీ చేసిన అనేక మంది అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు. తొలి విజయం.. పుదుక్కోట్టై మున్సిపాలిటీలోని 4వ వార్డులో విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ తరపున బరిలో దిగిన పర్వేజ్ మహ్మద్ విజయం సాధించారు. పర్వేజ్ విజయం ప్రకటన విడుదల కాగానే.. విజయ్ అభిమానుల్లో ఆనందం వెల్లు విరిచింది. అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతుండగా, విజయ్ మక్కల్ ఇయక్కం తరపున పోటీ చేసిన అనేక మంది అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు, ఇది అభిమానులలో భారీ ఆనందాన్ని నింపింది. పుదుక్కోట్టై మున్సిపాలిటీలోని 4వ వార్డులో విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ తరపున తొలిసారిగా పోటీ చేసిన పర్వేజ్ మహ్మద్ విజయం సాధించారు. పర్వేజ్ విజయం ప్రకటించిన వెంటనే, విజయ్ అభిమానులు వేడుకలు ప్రారంభించారు.