తమిళనాడు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన డీఎంకే..!

Published : May 02, 2021, 10:47 AM ISTUpdated : May 02, 2021, 12:27 PM IST
తమిళనాడు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన డీఎంకే..!

సారాంశం

మొత్తం 234 స్థానాలు కలిగిన తమిళనాడులో అధికారం చేపట్టాడనికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 స్థానాలను డీఎంకే దాటేసింది. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాలు కలిగిన తమిళనాడులో అధికారం చేపట్టాడనికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 స్థానాలను డీఎంకే దాటేసింది. ఇక ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి, బోడినాయక్కనూర్ లో డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, కొళతూరులో డీఎంకే స్టాలిన్, కోయంబత్తూర్ సౌత్ లో కమల్ హాసన్, చెపాక్ లో డీఎంకే అబ్యర్థి ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కోవిల్ పట్టిలో ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ , థౌజండ్ లైట్స్ లో బీజేపీ అభ్యర్థి, నటి ఖుష్బూ వెనకంజలో ఉన్నారు. 

ఇదిలా ఉండగా... (రిపబ్లిక్ సి ఓటర్ ) ఎగ్జిట్ పోల్ లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చింది. ప్రస్తుత పళనిస్వామి ప్రభుత్వానికి ఓటమి ఖాయమని బల్ల గుద్ది ప్రకటించింది. ఉన్న మొత్తం సీట్లలో డీఎంకే కూటమి 10-20 సీట్లను సాధించి అధికారం హస్తగతం చేసుకుంటుందని సర్వే పేర్కొంది. 
మరో మూడు రాష్ట్రాలు, మరొక కేంద్రపాలీత ప్రాంతాలతో కలిపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే దఫాలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అనేక పార్టీలు బరిలో ఉన్నప్పటికీ... ప్రధానంగా పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే సాగింది.  
డీఎంకే, కాంగ్రెస్ తో జతకట్టి బరిలో దిగగా, అన్నా డీఎంకే బీజేపీతో జతకట్టి బరిలోకి దిగింది. డీఎంకే, అన్నాడీఎంకేల అధినేతలు కరుణానిధి, జయలలితలు లేకుండా ఆ పార్టీలు ఎదుర్కుంటున్న తొలి ఎన్నికలు ఇవే..!కమలహాసన్, టీటీవి దినకరన్ కి చెందిన పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ... వారి ప్రభావం నామమాత్రంగానే ఉంది. 
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమిళనాడు అంతటా గెలుపుబావుటా ఎగురవేసింది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ లో కూడా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 155 నుండి 177 సీట్ల వరకు సాధించి దక్కించుకుంటుందని పేర్కొనగా, అధికార అన్నాడీఎంకే మాత్రం 22 నుండి 83 సీట్ల వరకు సాధిస్తుందని పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయి.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్