చికెన్ లేదన్నాడని దాబానే తగలబెట్టారు..

Bukka Sumabala   | Asianet News
Published : Jan 11, 2021, 12:24 PM IST
చికెన్ లేదన్నాడని దాబానే తగలబెట్టారు..

సారాంశం

చికెన్ లేదన్నాడని ఏకంగా దాబానే తగలబెట్టేశారు ఆ ఘనులు. చికెన్ అంటే వారికున్న పిచ్చి ఆ దాబా ఓనర్ పాలిట విషాదంగా మారింది. తాగిన మత్తులో దాబాకు నిప్పంటించేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.   

చికెన్ లేదన్నాడని ఏకంగా దాబానే తగలబెట్టేశారు ఆ ఘనులు. చికెన్ అంటే వారికున్న పిచ్చి ఆ దాబా ఓనర్ పాలిట విషాదంగా మారింది. తాగిన మత్తులో దాబాకు నిప్పంటించేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

వివరాలు.. శంకర్ టైడే(29), సాగర్ పటేల్(19)  అనే ఇద్దరు చికెన్ ప్రేమికులు.. ఫుల్‌గా మద్యం సేవించారు. తాగుతూ, ఊగుతూ అర్దరాత్రి ఒంటిగంట టైంలో బెల్టారోడి ప్రాంతంలోని రోడ్డుపక్కన ఉన్న ఓ దాబా హోటల్‌కు వెళ్లారు. 

అక్కడ తమకు చికెన్ ఐటమ్ కావాలంటూ ఆర్డర్ చేశారు. అయితే అప్పటికే  ఆ దాబాలో చికెన్ అయిపోంది. ఇదే విషయాన్ని దాబా ఓనర్ వారికి చెప్పి, చికెన్ దొరకదని అన్నాడు. తాగిన మత్తులో ఉన్నశంకర్, సాగర్‌లు దీన్ని ఒప్పుకోలేదు. తమకు చికెన్ కావాల్సిందేనని దాబా ఓనర్‌తో వాదనకు దిగారు. 

ఈ గొడవ ముదరడంతో ఆవేశానికి లోనైన వీరిద్దరు దాబాకు నిప్పంటించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరగలేదు. దాబాలోని వారంతా బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. దాబా కాలిపోవడంతో ఆస్తి నష్టం మాత్రం జరిగింది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక, కేసు నమోదు చేసుకుని నిందితులను విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?
పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu